Pandora Papers: పండోరా పేపర్లలోనూ సచిన్ టెండూల్కర్ ఆస్తుల చిట్టా

టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. అతని కుటుంబ సభ్యుల పేర్లు కూడా పండోరా పేపర్లలో వెలుగుచూశాయి. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ లో ఉన్న కంపెనీకి యజమానులుగా పేర్కొన్నారు.

Pandora Papers: పండోరా పేపర్లలోనూ సచిన్ టెండూల్కర్ ఆస్తుల చిట్టా

Pandora Papers (1)

Pandora Papers: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. అతని కుటుంబ సభ్యుల పేర్లు కూడా పండోరా పేపర్లలో వెలుగుచూశాయి. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ లో ఉన్న కంపెనీకి యజమానులుగా పేర్కొంటూ అందులో పేర్కొన్నాయి.

సచిన్ టెండూల్కర్, భార్య అంజలి టెండూల్కర్, మామ ఆనంద్ మెహతాల పేర్లు గతంలో విడుదలైన పనామా పేపర్లలోనూ ఉండగా ఇప్పుడు పండోరాలో మరికొన్ని వాస్తవాలు వెలువడ్డాయి. Saas International Limited అనే బీవీఐ ఆధారిత కంపెనీలో బీఓలుగా, డైరక్టర్ లుగా వ్యవహరిస్తున్నారు.

2007 నుంచి కంపెనీ ఓనర్లుగా ఉంటున్న వీరు 2016 జులై లిక్విడేషన్ సమయంలోనూ కొనసాగారు. కంపెనీ లిక్విడేషన్ చేస్తున్న సమయంలో షేర్‌హోల్డర్స్ వాల్యూ వివరాలు ఇలా ఉన్నాయి.

* Sachin Tendulkar (9 షేర్లు): 856,702 డాలర్లు

* Anjali Tendulkar (14 షేర్లు ): 1,375,714 డాలర్లు

* Anand Mehta (5 షేర్లు) 453,082 డాలర్లు

మొత్తం ఆ కంపెనీ బై బ్యాక్ షేర్ల విలువ దాదాపు 96వేల డాలర్ల వరకూ ఉంది. అవుట్ సెట్ కోసం 90షేర్లు ఉంచిన కంపెనీ 2007 ఆగష్టు 10న మొదలైనట్లుగా పేర్కొన్నారు. అందులో అంజలి టెండూల్కర్ కు 60షేర్లతో ఫస్ట్ షేర్ సర్టిఫికేట్, 30షేర్లతో సెకండ్ షేర్ సచిన్ మామ పేరిట ఇష్యూ అయింది.