T20 World Cup 2021 : 2 సిక్సర్లు బాది రిషభ్ పంత్ ఔట్

13 వ ఓవర్లో షాదాబ్ ఖాన్ వేసిన 13 ఓవర్ లో భారీ స్వీప్ షాట్ కు ట్రై చేసిన పంత్.. బంతిని గాల్లోకి లేపాడు.

10TV Telugu News

T20 World Cup 2021 :  పంత్ స్పీడ్ తో టీమిండియా ఇన్నింగ్స్ కుదురుకున్నట్టే కనిపించింది. వికెట్ల పతనాన్ని కోహ్లీ, పంత్ కాసేపు అడ్డుకున్నారు. ఐతే.. ఈ మాత్రం రన్ రేట్ తో పరుగులు చేస్తే.. సరిపోదనేది అభిమానుల మాట. వికట్ కీపర్ రిషభ్ పంత్.. ఔట్ కు ముందు తన పంచ్ పవర్ ను చూపించాడు. హసన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 12 వ ఓవర్ లో 2,3 బాల్స్ ను సిక్సర్లుగా మలిచాడు పంత్. 12 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 3 వికెట్లకు 81 రన్స్ చేసింది. కోహ్లీ 28… పంత్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఐతే… 13 వ ఓవర్లో షాదాబ్ ఖాన్ వేసిన 13 ఓవర్ లో భారీ స్వీప్ షాట్ కు ట్రై చేసిన పంత్.. బంతిని గాల్లోకి లేపాడు. బౌలరే పరుగెత్తికెళ్లి క్యాచ్ పట్టుకున్నాడు. పంత్ 30 బాల్స్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 రన్స్ చేసి ఔటయ్యాడు.

కెప్టెన్ కోహ్లీకి  రవీంద్ర జడేజా తోడయ్యాడు.