IPL 2021 MI vs PBKS, Preview: గెలిచేదెవరు? ఎవరి బలం ఎంత? పిచ్ రిపోర్ట్!

IPL 2021 MI vs PBKS, Preview: గెలిచేదెవరు? ఎవరి బలం ఎంత? పిచ్ రిపోర్ట్!

Mi Vs Pbks

PBKS vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌లో 17వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్‌తో పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటివరకు, ఈ సీజన్‌లో ముంబై నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. రెండు విజయాలు మాత్రమే అందుకుంది. పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య ఈ రోజు రాత్రి 7:30 నుండి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మునుపటి మ్యాచ్‌లో ఓడిపోగా.. ఈ మ్యాచ్‌లో గెలుపు సొంతం చేసుకోవాలని భావిస్తుంది.

పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో విజయంతో ప్రారంభమైనా కూడా.. తర్వాతి మ్యాచ్‌లలో చాలా కష్టపడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో కేవలం 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బ్యాటింగ్ బలంగా ఉంది కాని రాహుల్, మయాంక్ అగర్వాల్ మినహా మరే ఇతర బ్యాట్స్ మాన్ ఆడట్లేదు. బౌలర్లు కూడా ఊహించిన విధంగా ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. ‘యూనివర్స్ బాస్’ క్రిస్ గేల్ బ్యాట్ నుంచి పరుగులు రావట్లేదు. నికోలస్ పూరన్ కూడా విఫలం అవుతూనే ఉన్నాడు. మూడు పరాజయాల తర్వాత పంజాబ్.. ముంబై గెలవడం కష్టతరమైన అంశం.

పిచ్ రిపోర్ట్:

పిచ్ విషయానికి వస్తే.. చెన్నైకి చెందిన ఎంఏ చిదంబరం స్టేడియంలో పిచ్ ఈ సంవత్సరం భిన్నంగా ప్రవర్తిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలమైన ఈ పిచ్‌లో పరుగులు తియ్యడం చాలా కష్టంగా ఉంది. ఈ సంవత్సరం ఇక్కడ పిచ్ రెండవ ఇన్నింగ్స్‌లో చాలా నెమ్మదిగా ఉంటుంది. రాత్రి మ్యాచ్‌లో మంచు ముఖ్యమైన అంశం. పిచ్ చూస్తే, టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.

Avg first innings score: 157 (8 matches in IPL 2021 at the Chepauk)

Record of chasing teams: Won – 3, Lost – 5, Tied – 0

మ్యాచ్ అంచనా ప్రకారం.. ఈ మ్యాచ్‌లో ముంబైకే పైచేయి ఉంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాలలో, ముంబై జట్టు పంజాబ్ కింగ్స్ కంటే బలంగా ఉంది. అటువంటి పరిస్థితిలో, పంజాబ్ వరుసగా నాల్గవ ఓటమిని ఎదుర్కోవలసి ఉంటుంది.

Head-to-Head:

Played – 26 | Punjab Kings – 12 | Mumbai Indians– 14

ముంబై ఇండియన్స్- Probable XI: Quinton de Kock (wk), Rohit Sharma (c), Suryakumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Rahul Chahar, Jayant Yadav, Jasprit Bumrah, Trent Boult

పంజాబ్ కింగ్స్- Probable XI: KL Rahul (c/wk), Mayank Agarwal, Chris Gayle, Nicholas Pooran, Deepak Hooda, Moises Henriques, Shahrukh Khan, Fabian Allen, M Ashwin, Mohammed Shami, Arshdeep Singh.