ఇలాంటిది క్రికెట్ లో ఎప్పుడూ చూడలేదు: కోహ్లీ

ఇలాంటిది క్రికెట్ లో ఎప్పుడూ చూడలేదు: కోహ్లీ

టీమిండియా-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 8వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 287పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రీ ప్లేలో జడేజా రనౌట్ క్లియర్ గా కనిపించినప్పటికీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఈ ఘటనపై కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. 

టీమిండియా ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌ నాల్గో బంతికి జడేజా బంతిని మిడ్‌ వికెట్‌ వైపు కొట్టి సింగిల్‌ కోసం యత్నించాడు. దానిని అందుకున్న రోస్టన్‌ ఛేజ్‌ నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో వికెట్లను నేరుగా త్రో చేశాడు. దానికి అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. ఆ సమయంలో జడేజా క్రీజ్‌లోకి వచ్చాడని భావించిన ఫీల్డ్‌ అంపైర్‌ షాన్‌ జార్జ్‌ అది నాటౌట్‌గా ప్రకటించాడు.

కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఇది సింపుల్, ఫీల్డర్ అడిగినప్పుడు అంపైర్ నాటౌట్ అన్నాడు. బయట ఉన్న వాళ్లు ఫీల్డ్ లో జరిగేదాన్ని శాసించలేరు. ఇప్పుడూ అదే జరిగింది. అంపైర్, రిఫరీ కూర్చొని దానిని పరిశీలించాల్సింది’ అని అభిప్రాయపడ్డాడు. 

భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ తొలి ఫార్మాట్ అయిన టీ20సిరీస్‌ను 1-2 తేడాతో ఓడిపోయింది. వన్డే సిరీస్‌లో భారత్‌పై 1-0ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేను డిసెంబర్ 18న విశాఖపట్నం వేదికగా తలపడనున్నాయి ఇరు జట్లు.