T20 World Cup: కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ

ఓ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ... ‘‘కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతడు గొప్ప ఆటగాడు. అలాంటి ఆటగాళ్లు ఒత్తిడిలోనూ రాణిస్తారు. ఒత్తిడి వారిలోని ఉత్తమ ఆటగాడిని బయటకు తీసుకువస్తుంది’’ అని తెలిపారు. పాక్-భారత్ మధ్య జరిగిన మ్యాచు ప్రేక్షకులకు మంచి విందులా నిలిచిపోయిందని రోజర్ బిన్నీ చెప్పారు.

T20 World Cup: కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ

T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి 82 పరుగులు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అతడిపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రశంసలు కురిపించారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ… ‘‘కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతడు గొప్ప ఆటగాడు. అలాంటి ఆటగాళ్లు ఒత్తిడిలోనూ రాణిస్తారు. ఒత్తిడి వారిలోని ఉత్తమ ఆటగాడిని బయటకు తీసుకువస్తుంది’’ అని తెలిపారు.

పాక్-భారత్ మధ్య జరిగిన మ్యాచు ప్రేక్షకులకు మంచి విందులా నిలిచిపోయిందని రోజర్ బిన్నీ చెప్పారు. ‘‘ఇది నా కల వంటిది. మైదానంలో కోహ్లీ అంతబాగా ఆ షాట్లు ఎలా ఆడాడో అర్థం కావట్లేదు. ఇది ఒక అద్భుతమైన విజయం. పూర్తిగా పాక్ గెలుస్తుందనుకున్న మ్యాచులో మనం గెలిచాం. ఇటువంటి మ్యాచును మనం ఎన్నడూ చూడలేదు. ప్రేక్షకులు ఇటువంటి మ్యాచునే చూడాలనుకుంటారు’’ అని రోజర్ బిన్నీ చెప్పారు.

కాగా, ఆసియా కప్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో మాత్రం నాలుగు వికెట్ల తేడాతో, చివరి ఓవర్, చివరి బాల్ కు గెలిచి ప్రేక్షకులకు అసలైన మజా అందించింది. నెదర్లాండ్స్ తో జరిగిన రెండో మ్యాచులోనూ అద్భుతంగా రాణించి గెలిచింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..