PM Modi – PV Sindhu: సింధూతో కలిసి ఐస్‌క్రీమ్ తిందామని చెప్పిన ప్రధాని మోదీ

టోక్యో ఒలింపిక్స్ సక్సెస్ తర్వాత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీమ్ తింటానని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. మంగళవారం ఒలింపిక్ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారులతో వర్చువల్ కాన్ఫిరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కోచ్ పుల్లెల గోపీచంద్ ఫోన్ వాడొద్దని చెప్పడమే కాకుండా ఐస్ క్రీమ్ తినకుండా చేస్తున్నారని చెప్పారు.

PM Modi – PV Sindhu: సింధూతో కలిసి ఐస్‌క్రీమ్ తిందామని చెప్పిన ప్రధాని మోదీ

Pv Sindhu Pm Modi (3)

PM Modi – PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ సక్సెస్ తర్వాత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుతో కలిసి ఐస్‌క్రీమ్ తింటానని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. మంగళవారం ఒలింపిక్ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారులతో వర్చువల్ కాన్ఫిరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కోచ్ పుల్లెల గోపీచంద్ ఫోన్ వాడొద్దని చెప్పడమే కాకుండా ఐస్ క్రీమ్ తినకుండా చేస్తున్నారని చెప్పారు.

2016లోనూ ఐస్ క్రీమ్ తినకుండా ప్రాక్టీస్ చేసి సిల్వర్ మెడల్ దక్కించుకున్నానని చెప్పారు. మరికొద్దిరోజుల్లో జరగనున్న ఒలింపిక్స్ కోసం డైట్ కంట్రోల్ తప్పనిసరి అని.. ఎక్కువ మొత్తంలో ఐస్ క్రీమ్ తినడానికి వీలుండటం లేదని అంది. మరోసారి పీవీ సింధు సక్సెస్ ను టోక్యో 2020 టోర్నీలోనూ రిపీట్ చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ.

‘హార్డ్ వర్క్ చేయ్.. నీ మీద నమ్మకం ఉంది. ఈ సారి కూడా సక్సెస్‌ఫుల్ అవుతావు. సక్సెస్ తర్వాత మీ అందరినీ కలుస్తా. ఐస్‍‌క్రీమ్ తిందాం’ అని మోదీ చెప్పడంతో కాల్ లో ఉన్న సింధూ పేరెంట్స్ కూడా నవ్వేశారు. ఇదే వీడియో కాల్ లో ఆర్చర్ దీపికా కుమారీ, బాక్సర్ మేరీ కోమ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కూడా మాట్లాడారు.

కొత్త భారతానికి క్రీడాకారులు ప్రతిబింబం లాంటివాళ్లని. ఒత్తిడి గురించి ఆందోళన చెందొద్దని ధైర్యమైన మనస్సుతో టోక్యోకు బయల్దేరాలని చెప్పారు.