Hockey Bronze : గోల్ పోస్ట్ ఎక్కిన శ్రీజిష్., ఫొటో వైరల్
అది నా ప్లేస్, కష్టం, నష్టం సంతోషం దు:ఖం అన్నీ పోస్టుతోనే...అంటున్నాడు భారత హకీ గోల్ కీపర్ శ్రీజిష్. టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో టీమిండియా హకీ జట్టు విజయం సాధించింది.

Tokyo
PR Sreejesh : అది నా ప్లేస్, కష్టం, నష్టం సంతోషం దు:ఖం అన్నీ పోస్టుతోనే…అంటున్నాడు భారత హకీ గోల్ కీపర్ శ్రీజిష్.. టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో టీమిండియా హకీ జట్టు విజయం సాధించింది. దాదాపు 41 సంవత్సరాల తర్వాత..ఒలింపిక్ పతకం సాధించి..చరిత్రను తిరగరాసింది. దీంతో క్రీడాకారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే…గోల్ కీపర్ గా ఉన్న శ్రీజిష్ మ్యాచ్ అనంతరం గోల్ పోస్టు పైకి ఎక్కి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫొటో నెట్టింట వైరల్ గా మారుతోంది. అందుకే అలా ఎక్కి వేడుక చేసుకున్నా అని శ్రీజిష్. భావోద్వేగంతో వెల్లడించాడు.
Read More : Ghani : దీపావళికి థియేటర్లలో బాక్సర్ ‘గని’ పంచ్‌లు..
అందరి చూపు ఒకడివైపు : –
టీమిండియాతో పాటు మ్యాచ్ చూస్తున్న భారత్ అభిమానులకు ఒకటే టెన్షన్. అందరీ చూపు ఒకడివైపే. అతడే భారత్ జట్టు గోల్ కీపర్ శ్రీజిష్. టీమిండియాకు ఎన్నో సార్లు అపురూప విజయలు అందించిన శ్రీజిష్ ఈ ఒక్క గోల్ ఆపాలని అందరూ ప్రార్థించారు. జర్మనీకి అదే చివరి అవకాశం కావడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. జర్మనీ ఆటగాడు బలంగా కొట్టిన బంతిని శ్రీజిష్ అడ్డుకున్నాడు. అంతే జర్మనీ ఆటగాళ్లు బాధతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయారు. ఇటు భారత్ శిబిరంలో విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Read More : Soft Drink: కూల్ డ్రింక్ తాగిన బాలిక.. కాసేపటికి మృతి!
41 ఏళ్ల నిరీక్షణ : –
శ్రీజిష్ ఆపింది ఒక గోల్‌నే కాదు. అతడి వల్ల సాధ్యమైంది ఒక బ్రాంజ్ మెడలే కాదు. దాని వెనుక 41ఏళ్ల నిరీక్షణ ఉంది. ఆటగాళ్ల కఠోర శ్రమ దాగుంది. ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకను 40ఏళ్ల తర్వాత రెపరెపలాడించాలనే ఆకాంక్ష ఉంది. వీటన్నిటికీ సార్థకత చేకూర్చింది శ్రీజిష్. భారత్ హాకీకి గోడగా నిలిచే శ్రీజిష్.. టీమిండియా కాంస్యం గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. శ్రీజిష్ తన అద్భుత ప్రతిభతో ప్రత్యర్థికి గోల్స్ రాకుండా టోర్నమెంట్ అంతా అడ్డుకున్నాడు.
Read More :AP Corona Cases : ఏపీలో కొత్తగా 2,145 కరోనా కేసులు, 24 మంది మృతి
కీలక ఆటగాడు : –
దీంతో మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఒలింపిక్స్‌లో భారత్ పురుషుల హాకీ జట్టు ఆడిన తొలి మ్యాచ్ నుంచి బ్రాంజ్ మెడల్ మ్యాచ్ వరకు శ్రీజిష్ చూపిన ప్రతిభ అసాధారణం. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, జపాన్‌లపై మ్యాచ్‌ల్లో అతడు గోల్ పోస్ట్‌కు గోడలా నిలబడ్డాడు. కేరళకు చెందిన శ్రీజిష్ జట్టులో ఎన్నో ఏళ్లుగా కీలక ఆటగాడు. భారత జట్టుకు గతంలో నాయకత్వం కూడా వహించాడు. తన అద్భుత కీపింగ్‌తో యువ హాకీ క్రీడాకారులను కూడా తీర్చిదిద్దిన ఘనత అతని సొంతం.