అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ రిటైర్మెంట్

టీమిండియా స్పిన్నర్.. హైదరాబాదీ ప్రగ్యాన్ ఓఝా శుక్రవారం ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన ప్రగ్యాన్.. 16ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగాడు. 2013నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. 2019వరకూ దేశీవాలీ క్రికెట్ లో ఆడాడు. 33ఏళ్ల ఈ క్రికెటర్ చివరి సారిగా సచిన్ టెండూల్కర్ ఫేర్‌వెల్ టెస్టు మ్యాచ్ లో ఆడాడు. 

మొత్తం 24టెస్టులు ఆడిన వ్యక్తి 2009నుంచి 2013వరకూ ఆడి 113వికెట్లు తీయగలిగాడు. ‘నా జీవితంలో రెండో దశకు చేరుకోవాలనుకుంటున్నా. ప్రతి సమయంలో మీరు చూపించిన లవ్, సపోర్ట్‌ నన్ను మోటివేట్ చేశాయి’ అని ప్రగ్యాన్ ఓఝా ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. 

ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్ ఓఝా వరల్డ్ నెం.5కు చేరడం అతని జీవితంలో గుర్తుండిపోయే క్షణం. ఐపీఎల్‌లో ఓ సారి పర్పుల్ కెమెరాను దక్కించుకున్నాడు. 2014 డిసెంబరులో కాంపిటీటివ్ క్రికెట్‌లో బౌలింగ్ నియమాలు ఉల్లంఘించాడంటూ విచారణ జరిపారు. 2015 జనవరి 30న తిరిగి బౌలింగ్ ఆడొచ్చని క్లియరెన్స్ ఇచ్చారు. 2008 జూన్ 28న ఓఝా తొలి వన్డేను బంగ్లాదేశ్‌తో ఆడాడు.

క్రికెటర్‌గా భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. అత్యున్నత స్థాయిని చేరుకోవాలని అందరికీ ఉటుంది. అదృష్టం కొద్దీ నాకు ఆ అవకాశం దొరికింది. నా కలను సాకారం చేసుకోగలిగాను. నామీద ప్రేమ, గౌరవం పంచినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు.