RCB vs SRH, Preview: ఎవరి బలం ఎంత? గెలిచేదెవరు?

RCB vs SRH, Preview: ఎవరి బలం ఎంత? గెలిచేదెవరు?

RCB vs SRH, IPL 2021: ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాత్రి 07గంటల 30నిమిషాల నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఆర్‌సిబి తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయంతో గెలుస్తామని ధీమాగా ఉండగా.. అదే సమయంలో హైదరాబాద్.. కోల్‌కత్తా చేతిలో మొదటి మ్యాచ్లో ఓటమిపాలై రెండో మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10మ్యాచ్‌లు, రాయల్ ఛాలెంజర్స్ 7మ్యాచ్‌లలో గెలిచింది.

చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుండగా.. రషీద్ ఖాన్ మరియు మహ్మద్ నబీ ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు అనుకూలంగా మార్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ స్పిన్ విభాగం బలహీనంగా ఉంది. అలాగే వార్నర్ బెంగళూరుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకరు. హైదరాబాద్ తరఫున వార్నర్ రాయల్ ఛాలెంజర్స్‌పై అత్యధికంగా 593 పరుగులు చేయగా.. హైదరాబాద్‌పై అత్యధిక 531 పరుగులు చేసిన జట్టు కెప్టెన్ కోహ్లీ పేరిట రికార్డు ఉంది.

బౌలింగ్ విషయానికి వస్తే.. భువనేశ్వర్ కుమార్ రాయల్ ఛాలెంజర్స్‌పై హైదరాబాద్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్. కోహ్లీ జట్టుపై 14 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, హైదరాబాద్‌పై గరిష్టంగా 16 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఉన్నాడు. స్పిన్ పిచ్‌లపై ఎవరి సత్తా ఏంటీ? అనేది ఇవాళ తేలనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ లేకుండా ఫస్ట్ మ్యాచ్‌లో మైదానంలోకి దిగగా.. రెండవ మ్యాచ్‌లో కూడా కేన్ విలియమ్సన్‌ ఆడడం కష్టమే. కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ ఈ మేరకు కీలక విషయం వెల్లడించారు. కేన్ విలియమ్సన్ ఆరోగ్యంగా మారి అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ క్రమంలో మిడిల్ ఆర్డర్ మరోసారి బెయిర్‌స్టో భుజాలపై పడుతోంది.

ఐదుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ ఊపు మీద ఉండగా.. ఈ మ్యాచ్‌లో పడిక్కల్ అందుబాటులోకి వస్తే రాయల్ ఛాలెంజర్స్ మరింత బలోపేతం అవుతుంది. పడిక్కల్ కరోనా కారణంగా ఐసోలేషన్‌లో ఉండగా.. ఇప్పుడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. గత సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 473 పరుగులు చేసి జట్టుకు అత్యధిక పరుగులు అందించాడు. తన మొదటి సీజన్లో, అతను ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌ల్లో 218, విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 737 పరుగులు చేశాడు. పడిక్కల్ బుధవారం ఆడకపోతే, కోహ్లీ మరియు వాషింగ్టన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ మిడిల్ ఆర్డర్‌లో బలంగా ఉన్నారు.

జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
Probable XI: Virat Kohli (c), Devdutt Padikkal, Rajat Patidar, Glenn Maxwell, AB de Villiers (wk), Washington Sundar, Daniel Christian, Kyle Jamieson, Harshal Patel, Mohammad Siraj, Yuzvendra Chahal

సన్‌రైజర్స్ హైదరాబాద్:
Probable XI: David Warner (c), Wriddhiman Saha (wk), Manish Pandey, Jonny Bairstow, Jason Holder/Mohammad Nabi, Vijay Shankar, Abdul Samad, Rashid Khan, Bhuvneshwar Kumar, Shahbaz Nadeem/Sandeep Sharma, T Natarajan