Wrestlers Protest: బీజేపీ నుంచి తొలిసారి మహిళా ఎంపీ స్పందన.. ఏమన్నారంటే?

బీజేపీ మహారాష్ట్ర ఎంపీ ప్రితం ముండే (Pritam Munde) కీలక వ్యాఖ్యలు చేశారు.

Wrestlers Protest: బీజేపీ నుంచి తొలిసారి మహిళా ఎంపీ స్పందన.. ఏమన్నారంటే?

Pritam Munde

Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) పై భారత టాప్ రెజ్లర్లు కొన్ని నెలలుగా పోరాడుతున్నా ఆ పార్టీ నుంచి స్పందన లేదు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు చేస్తోన్న ఆందోళనపై తొలిసారి బీజేపీ నుంచి ఓ మహిళా ఎంపీ స్పందించారు.

బీజేపీ మహారాష్ట్ర ఎంపీ ప్రితం ముండే (Pritam Munde) మాట్లాడారు. పార్లమెంటు సభ్యురాలిగా కాకుండా ఓ మహిళగా తాను ఓ విషయం చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఏ మహిళ ఫిర్యాదు చేసినప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని అన్నారు.

అనంతరం, ఆ ఫిర్యాదు సరైనదా? కాదా? అన్న విషయంపై అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం కేసులో చర్యలు తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రజాస్వామ్యంలో సరికాదని చెప్పారు.

బీజేపీకి మొదటి ప్రాధాన్య అంశం దేశమేనని, ఆ తర్వాత పార్టీ అని, ఆ తర్వాతే సొంత ప్రయోజనాలని ప్రితం ముండే అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు చివర ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఆలోచనలు ముఖ్యమేనని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే.. రెజ్లర్ల ఆందోళన వంటి పెద్ద పోరాటం జరుగుతున్నప్పుడు దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

Wrestlers Protest: తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు.. రెజ్ల‌ర్ల‌కు కపిల్ సేన విన్న‌పం