Prithvi Shaw: రంజీ ట్రోఫీలో పృథ్వీ షా సంచలనం.. ట్రిపుల్ సెంచరీతో రికార్డ్

ఈ మ్యాచ్‌లో 379 పరుగులు సాధించి, రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాత రికార్డుల్ని తిరగరాశాడు.

Prithvi Shaw: రంజీ ట్రోఫీలో పృథ్వీ షా సంచలనం.. ట్రిపుల్ సెంచరీతో రికార్డ్

Prithvi Shaw: రంజీ ట్రోఫీలో యువ బ్యాటర్ పృథ్వీ షా అరుదైన రికార్డు సాధించాడు. ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్న ఈ యువ ఆటగాడు బుధవారం అసోంతో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు.

Delhi airport: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో బహిరంగ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. అరెస్టు

ఈ మ్యాచ్‌లో 379 పరుగులు సాధించి, రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాత రికార్డుల్ని తిరగరాశాడు. అసోంలోని గౌహతిలో ఈ మ్యాచ్ జరుగుతోంది. పృథ్వీ షా 383 బంతుల్లో, 379 పరుగులు చేశాడు. ఇది అతడికి తొలి ట్రిపుల్ సెంచరీ. రంజీల్లో ముంబై తరఫున ఒక మ్యాచ్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత అత్యధిక స్కోరు కూడా ఇదే. రంజీ ట్రోఫీకి సంబంధించి ఇది రెండో అత్యధిక స్కోరు.

Uppal Stadium: 18న ఉప్పల్‌లో వన్డే మ్యాచ్.. 13 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం

గతంలో ముంబై తరఫున రంజీల్లో అత్యధిక స్కోరు సంజయ్ మంజ్రేకర్ పేరిట ఉండేది. 1990–91 రంజీ సీజన్‌లో సంజయ్ మంజ్రేకర్, హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో 377 పరుగులు చేశాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా సంజయ్ మంజ్రేకర్ పేరిట ఉన్న రికార్డును పృథ్వీ షా బ్రేక్ చేశాడు. ఈ ఏడాదికి సంబంధించి రంజీ ట్రోఫీలో తొలి సెంచరీ కూడా ఇదే. గతంలో ఆడిన చివరి ఏడు ఇన్నింగ్సుల్లో అతడు అనుకున్న స్థాయిలో రాణించలేదు. అన్ని ఇన్నింగ్స్ కలిపి 160 పరుగులు మాత్రమే చేశాడు. ఆయన సగటు 22.85 కాగా, అత్యధిక స్కోరు 68గా ఉంది.

Andhra Pardesh: రేపటి నుంచి ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్ల జారీ

అయితే, అంతకుముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా పృథ్వీ షా రాణించాడు. ఈ ట్రోఫీలో 181.42 సగటుతో 332 పరుగులు సాధించాడు. అసోంతో జరిగిన మ్యాచులో 134 పరుగులు ఆయన అత్యధిక స్కోరు. దేశవాళీ ట్రోఫీల్లో రాణిస్తున్నప్పటికీ పృథ్వీ షాకు జాతీయ జట్టులో సుస్థిర స్థానం లభించడం లేదు. ఈ యువ ఆటగాడు చివరగా 2021 జూలైలో ఇండియ తరఫున ఆడాడు.