Prithvi Shaw: చెప్పకుండా దగ్గు మందు తాగినందుకే పృథ్వీ షాకు 8నెలల బ్యాన్

టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా 2019లో 8 నెలల నిషేదం గురించి ఓపెన్ అయ్యారు. ఈ ముంబై బ్యాట్స్‌మన్ కెరీర్లో ఇదే క్లిష్టమైన దశగా అభివర్ణించాడు.

Prithvi Shaw: చెప్పకుండా దగ్గు మందు తాగినందుకే పృథ్వీ షాకు 8నెలల బ్యాన్

Prithwi Shah

Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా 2019లో 8 నెలల నిషేదం గురించి ఓపెన్ అయ్యారు. ఈ ముంబై బ్యాట్స్‌మన్ కెరీర్లో ఇదే క్లిష్టమైన దశగా అభివర్ణించాడు. ఐపీఎల్ 2019 తర్వాత సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీకి ముందు జరిపిన డోపింగ్ టెస్టుల్లో పాజిటివ్ గా తేలడంతో నిషేదం విధించారు.

‘నిషేదిత పదార్థాన్ని తీసుకున్నాడు పృథ్వీ షా. దానిని దగ్గు సిరప్ గా భావిస్తున్నాం. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్‌లకు, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లకు అవకాశం కోల్పోయాడు. డోపింగ్ టెస్టులో దోషిగా తేలినప్పటికీ బీసీసీఐ విధించబోయిన సుదీర్ఘమైన నిషేదాన్ని తన వివరణతో తగ్గించుకోగలిగాడు.

బ్యాన్ తర్వాత ప్రజలు తనని ఎలా చూస్తారో అనే దానిపై షా బాధపడ్డాడు. ఇవన్నీ తట్టుకోవడానికి కాస్త దూరంగా వెళ్లాలని ఫీల్ అయిన షా కొద్ది నెలలు లండన్ వెళ్లిపోయాడు.

‘దగ్గు మందు కాంట్రవర్సీకి నేను, మా నాన్నే బాధ్యులం. ఇండోర్ లో సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీ జరుగుతుంది. నాకు జలుబు, దగ్గు అనిపించింది. బయటకు డిన్నర్ కు వెళ్లినప్పుడు బాగా దగ్గు వచ్చింది. ఇదే మా నాన్నకు చెప్పడంతో అందుబాటులో ఉన్న దగ్గు సిరప్ కొనుక్కుని తాగమని సలహా ఇచ్చాడు. నా ఫిజియోను సంప్రదించకుండా అది తీసుకోవడమే నేను చేసిన తప్పు’

రెండ్రోజులు తీసుకున్న తర్వాత మూడో రోజు నాకు డోప్ టెస్టు జరిగింది. అందులో పాజిటివ్ రావడంతో బ్యాన్ విధించారు. అది నా మాటల్లో చెప్పలేను. నాకు చాలా క్లిష్టమైన సమయం. నా గురించి నేను ప్రతిచోటా వెదికాను. ప్రజలు ఏమనుకుంటారో అని ఆందోళన కలిగింది. నిషేదిత డ్రగ్స్ తీసుకున్నానని అనుకుంటారేమో అనిపించింది. అలాగే రెండున్నర నెలలు గడిపాను. ప్రతిరోజూ బాధపడేవాణ్ని. జీవితంలో మంచి దశలో ఉండగా కిందపడిపోయా’ అని షా చెప్పుకొచ్చాడు.

బ్యాన్ సమయంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో రాహుల్ ద్రవిడ్ తో కలిసి పనిచేశాడు. న్యూజిలాండ్ టూర్ లో తిరిగి చోటు దక్కించుకున్నా.. ఫామ్ కనబరచలేకపోయాడు. ఐపీఎల్ 2021లో పుంజుకున్న పృథ్వీ.. 8మ్యాచుల్లో 308పరుగులు చేయగలిగాడు.