Prithvi Shaw: సెల్ఫీ ఇవ్వలేదని పృథ్వీ షా కారుపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

పృథ్వీ షా తన స్నేహితుడితో కలిసి బుధవారం సాయంత్రం మ్యాన్సన్ క్లబ్ ఆఫ్ సహారా అనే స్టార్ హోటల్‌కు వెళ్లాడు. అనంతరం హోటల్‌లోని క్లబ్ నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తులు పృథ్వీ షాను సెల్ఫీ అడిగారు. వారికి షా సెల్ఫీ ఇచ్చారు. అయితే, ఇంకో సెల్ఫీ కావాలని మళ్లీ అడిగారు.

Prithvi Shaw: సెల్ఫీ ఇవ్వలేదని పృథ్వీ షా కారుపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

Prithvi Shaw: సెలబ్రిటీ ఇమేజ్ కొన్నిసార్లు చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. తాజాగా ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ ఇవ్వలేదని అతడు ప్రయాణిస్తున్న కారుపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి ముంబైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పృథ్వీ షా తన స్నేహితుడితో కలిసి బుధవారం సాయంత్రం మ్యాన్సన్ క్లబ్ ఆఫ్ సహారా అనే స్టార్ హోటల్‌కు వెళ్లాడు.

Kanna Lakshmi Narayana: మోదీ పట్ల జీవితాంతం అభిమానంతో ఉంటా.. రాష్ట్ర పార్టీలో పరిస్థితులకు ఇమడలేకే రాజీనామా..

అనంతరం హోటల్‌లోని క్లబ్ నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తులు పృథ్వీ షాను సెల్ఫీ అడిగారు. వారికి షా సెల్ఫీ ఇచ్చారు. అయితే, ఇంకో సెల్ఫీ కావాలని మళ్లీ అడిగారు. దీనికి షా నిరాకరించాడు. అక్కడున్న క్లబ్ మేనేజర్ ఆ ఇద్దరినీ, క్లబ్ నుంచి బయటకు పంపించేశాడు. పృథ్వీ షాను విసిగిస్తుండటంతో వారిని అక్కడ్నుంచి వెళ్లగొట్టారు. అయితే, వాళ్లు క్లబ్ బయట పార్కింగ్ ప్లేసులో వారి కోసం ఎదురు చూశారు. కొంతసేపటి తర్వాత షా, అతడి స్నేహితుడితో కలిసి కారు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ ఇద్దరూ షా ప్రయాణించే కారుపై దాడికి పాల్పడ్డారు.

GVL Narasimha Rao: రాష్ట్రంలో రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు కనిపించవా..?

ఆ కారు షా స్నేహితుడిది. బేస్ బాల్ బ్యాట్ తీసుకుని కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో షా స్నేహితుడు కారులోనే ఉన్నారు. అంతేకాదు.. ఆ తర్వాత అతడ్ని రూ.50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తప్పుడు కేసు పెడతామని బెదిరించారు. ఈ ఘటన తర్వాత పృథ్వీ షా వేరే కారులో ఇంటికి వెళ్లిపోయాడు.

అతడి స్నేహితుడు పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల్ని సానా గిల్, శోభిత్ ఠాకూర్‌గా గుర్తించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.