Priya Malik : మెడల్ గెలిచిందనుకుని ప్రియాకు కంగ్రాట్స్ చెప్పిన ఇషాంత్..తర్వాత

ఒలింపిక్ మెడల్ గెలిచిందని అనుకుని ఇండియన్ రెజ్లర్ ప్రియా మాలిక్ కు టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కంగ్రాట్స్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. నిజంగానే..ప్రియా మెడల్ సాధించిందని అనుకుని ఇతరులు కూడా శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు.

Priya Malik : మెడల్ గెలిచిందనుకుని ప్రియాకు కంగ్రాట్స్ చెప్పిన ఇషాంత్..తర్వాత

Ishanth

Ishant Sharma Confuses : ఒలింపిక్ మెడల్ గెలిచిందని అనుకుని ఇండియన్ రెజ్లర్ ప్రియా మాలిక్ కు టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కంగ్రాట్స్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. నిజంగానే..ప్రియా మెడల్ సాధించిందని అనుకుని ఇతరులు కూడా శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. ఇది కాస్తా..వైరల్ గా మారిపోయింది. అసలు విషయం తెలుసుకుని ఇషాంత్ నాలిక కరుచుకున్నాడు. వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. దీనికి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది.

Read More : Amazon Jeff Bezos : అమెజాన్ బాస్‌ను ఏలియన్స్ కిడ్నాప్ చేశారు అంటూ పుకార్లు

ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో రోజు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలిచారు. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా…ఆదివారం వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ఇండియన్ రెజ్లర్ ప్రియా మాలిక్ పాల్గొన్నారు.

Read More : Metro Station: మెట్రో స్టేషన్లో సూసైడ్‍కు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

ఇందులో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విషయం టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మకు తెలిసింది. అయితే..ఒలింపిక్ మెడల్ సాధించిందని అనుకుని…ట్విటర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు. ఇతరులు కూడా నిజమే అనుకుని శుభాకాంక్షలు తెలియచేశారు. విషయం తెలుసుకున్న ఇషాంత్ ట్విట్టర్ నుంచి ట్వీట్ డిలీట్ చేశారు. దీంతో ట్విట‌ర్‌లో #NotOlympics ట్రెండింగ్ అయింది.