IPL 2021 : నడి సముద్రంలో క్రికెట్ ఆడుతూ..ధోనికి శుభాకాంక్షలు

ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కాంక్షిస్తూ...శుభాకాంక్షలు తెలియచేస్తూ...నడి సముద్రంలో స్కూబా డ్రైవింగ్ ట్రైనర్లు సాహసం చేశారు.

IPL 2021 : నడి సముద్రంలో క్రికెట్ ఆడుతూ..ధోనికి శుభాకాంక్షలు

Ipl 2021

Puducherry Scuba Diving Cricket : మైదానంలో…గల్లీలోనే క్రికెట్ ఆడుతారా..? సముద్రంలో ఆడలేరా ? సముద్రంలో కూడా ఆడవచ్చు అని నిరూపించారు. అచ్చం మైదానంలో ఎలా ఆడుతారో అలాగే ఆడి..ధోనికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కాంక్షిస్తూ…శుభాకాంక్షలు తెలియచేస్తూ…నడి సముద్రంలో స్కూబా డ్రైవింగ్ ట్రైనర్లు ఈ సాహసం చేశారు. ఇది…శనివారం వెలుగులోకి వచ్చింది. బ్యాట్..బాల్ పట్టి క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇటీవలే..నడి సముద్రంలో వీరు ఓ జంటకు వివాహం చేసిన ఘటన సంచలనం సృష్టించింది.

Read More : T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో వేరే దేశం నుంచి ఆడుతున్న తెలుగు కుర్రాడు

అంతేగాకుండా..వినాయక చవితి పర్వదినం సందర్భంగా..వినాయకుడి…ప్రతిమను సముద్రంలో నిమజ్జనం చేసి వార్తల్లోకి ఎక్కారు. శుక్రవారం దుబాయ్ వేదికగా..ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించాలని కోరుకుంటూ….ధోని సేనకు శుభాకాంక్షలు వెల్లడిస్తూ…స్కూబా స్విమ్మర్లు నడి సముద్రంలో క్రికెట్ ఆడి…అందర్నీ అలరించారు. పుదుచ్చేరి – తమిళనాడుకు చెందిన టెంపుల్ అట్ వెంచ్రస్ పేరిట అరవింద్ నేతృత్వంలోని బృందం స్కూబా డ్రైవింగ్ శిక్షణ పొందుతోంది. చెన్నై శివారులోని నీలకంరై నుంచి..పుదుచ్చేరి మధ్యలో 12 నాటికన్ మైళ్ల దూరంలో నడి సముద్రంలో క్రికెట్ ఆడారు. స్టంపులు, బాల్, బ్యాట్..ఇతర క్రికెట్ సామాగ్రీ తీసుకుని..నడి సముద్రంలోకి దిగారు. ఇతర భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. చెన్నై కింగ్స్ ఆటగాళ్లను తలపించే విధంగా…జెర్సీ ధరించి..క్రికెట్ ఆడడం నెటిజన్లను ఆకర్షించింది. చివరగా..ఫైనల్ మ్యాచ్ లో చెన్నై జట్టు విజయం సాధించడంతో..అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.