WTC Final 2023: నయావాల్ మారిపోయాడా..! టీమ్‌తో కలిసి ప్రయాణం చేయడం లేదు.. సొంత కారులో.. ఆశ్చర్యపోయిన జడేజా
క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ప్రతిష్టాత్మక టెస్టు చాంఫియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ మీదే ఉంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

Cheteshwar Pujara-Ravindra Jadeja
WTC Final: క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ మీదే ఉంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు లండన్ చేరుకుని తీవ్రంగా సాధన చేస్తున్నారు. అయితే.. ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
టెస్టు ఆటగాడిగా ముద్ర పడ్డ నయావాల్ పుజారాకు ఐపీఎల్(IPL)లో చోటు దక్కకపోవడం తెలిసిందే. దీంతో స్వదేశంలో ఐపీఎల్ జరిగే సమయంలో పుజారా విదేశాల్లో లీగుల్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో దాదాపు రెండు నెలల క్రితమే అతడు ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో సస్సెక్స్ తరుపున ఆడాడు. అంతేకాదు ఆ జట్టుకు పుజారానే కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం అక్కడే ఉండిపోయాడు.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన విరాట్ కోహ్లి
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం టీమ్ఇండియా ఇంగ్లాండ్ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు ముందు పుజారా, జడేజా(Ravindra Jadeja) ల మధ్య ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. భారత ఆటగాళ్లు అందరూ టీమ్ బస్సులో ప్రాక్టీస్ చేసే స్టేడియానికి చేరుకోగా పుజారా మాత్రం సొంతంగా కారు డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడకు వచ్చాడు. ఇది చూసిన రవీంద్ర జడేజా ఆశ్చర్యపోయాడు. వెంటనే నయావాల్‌తో ఇలా అన్నాడు. ‘నువ్వు చెప్పింది నిజమే పూజి భాయ్. వ్యక్తిగత కారు కూడా.’ అంటూ అతడిని ఆట పట్టించే ప్రయత్నం చేశాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పుజరా పుల్ ఫామ్‌లో ఉన్నాడు. కౌంటీ ఛాంపియన్ షిప్‌లో 6 మ్యాచులు ఆడిన పుజరా 68.12 సగటుతో 545 పరుగులు చేశాడు. ఇక ఇదే ఫామ్‌ను అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 35 ఏళ్ల పుజారా టీమ్ఇండియా తరుపున ఇప్పటి వరకు 102 టెస్టు మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 7,154 పరుగులు చేశాడు. ఇందులో 19 శతకాలు, 35 అర్ధశతకాలు ఉన్నాయి.