BWF టోర్నమెంట్ : సెమీఫైనల్లోకి సింధు, సాయి ప్రణీత్ 

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, సాయి ప్రణీత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు.

  • Published By: sreehari ,Published On : August 23, 2019 / 01:56 PM IST
BWF టోర్నమెంట్ : సెమీఫైనల్లోకి సింధు, సాయి ప్రణీత్ 

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, సాయి ప్రణీత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు.

BWF వరల్డ్ చాంపియన్ షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ విభాగంలో చైనీస్ తైపీ షట్లర్ తై తెజు యింగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 12-21, 23-21, 21-19 తేడాతో సింధు గెలిచింది. బీడబ్ల్యూఎఫ్ చాంపియన్ షిప్ లో సింధు తన ఐదో మెడల్ అవకాశాన్ని పదిలం చేసుకుంది.

ఏసియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ తాయి తజు యింగ్‌ను క్వార్టర్ ఫైనల్లో ఓడించి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.  ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో గత రెండు ఎడిషన్ల నుంచి సింధు వరుసగా రజత పతకాలు సాధిస్తూ వస్తోంది. మరో రెండు కాంస్య పతకాలకు చేరువలో నిలిచింది.

తొలిగేమ్‌లో సింధు 9 పాయింట్లు సాధించగా.. రెండో గేమ్ లో సింధు 3-3సమం చేయడానికి ముందే అద్భుత ప్రదర్శనతో 2-0తో ఆధిక్యం కనబర్చింది. సింధు కళ్లు చెదిరే ప్రదర్శనతో దూసుకెళ్లడంతో తజు యింగ్ ప్రతిఘటించలేక 5-8కు పడిపోయింది. చివర్లో సింధు దూకుడు పెంచడంతో చైనా యింగ్ చేతులేత్తేసింది. 

చైనా చెన్ యుఫెయికు డెన్మార్క్ మియా బ్లిచ్ ఫ్లెడెట్ మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్లో గెలిచినవారితో 24ఏళ్ల ఒలంపిక్ రజత పతక విజేత సింధు.. సెమీ ఫైనల్ పోరులో తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో మరో భారత షట్లర్ సాయి ప్రణీత్ ఇండోనేషియా షట్లర్ జోనాటన్ క్రిస్టీను ఓడించి సెమీఫైనల్లో ప్రవేశించాడు. ప్రఈ టోర్నీలో ఇప్పటికే ఇతర భారత షట్లర్ లలో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ప్రీక్వార్టర్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించారు.