PV Sindhu : నా విజయం దేశానికి, కుటుంబానికి అంకితం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని భారత షట్లర్‌, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అన్నారు. సింధు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుక దాగున్న శ్రమ గురించి వివరించారు.

PV Sindhu : నా విజయం దేశానికి, కుటుంబానికి అంకితం

Pv Sindhu

PV Sindhu : టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని భారత షట్లర్‌, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అన్నారు. సింధు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుక దాగున్న శ్రమ గురించి వివరించారు. డిఫెన్స్ మెరుగు కోసమే గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేశాను.

గచ్చిబౌలిలో సదుపాయాలు కల్పించిన కేంద్రానికి కృతజ్ఞతలు. తన విజయంలో కోచ్ పాత్ర కీలకం. తన కుటుంబానికి దూరంగా ఉండి కోచ్‌ చాలా కష్టపడ్డాడు. నాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని సింధు అన్నారు.

తన విజయాన్ని దేశానికి కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లు సింధు తెలిపారు. రియో ఒలింపిక్స్ తర్వాత ఆటలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకరించింది అని సింధు చెప్పుకొచ్చారు.

కాగా వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి తైజుయింగ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో సింధు ఓటమి చవిచూశారు. అనంతరం కాంస్యపతకం కోసం జరిగిన మ్యాచ్ లో చైనా క్రీడాకారిణిపై విజయం సాధించి పతకం తీసుకొచ్చారు.