PV Sindhu : సింగపూర్ ఓపెన్ విజేత సింధుపై ట్రోల్స్.. స్పందించిన కోచ్

సింగపూర్ ఓపెన్ లో టాప్ ప్లేయర్స్ ఎవరూ పాల్గొనకపోవడం వల్లే పివి సింధు టైటిల్ గెలిచిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై సింధు కోచ్ పార్క్ టేసాంగ్ స్పందించారు.

PV Sindhu : సింగపూర్ ఓపెన్ లో టాప్ ప్లేయర్స్ ఎవరూ పాల్గొనకపోవడం వల్లే పివి సింధు టైటిల్ గెలిచిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై సింధు కోచ్ పార్క్ టేసాంగ్ స్పందించారు. ఈ టోర్నీలో సింధు విజయం అంత సులభం కాలేదన్నారు. ఎవరు పాల్గొన్నా, పాల్గనకపోయినా చివరికి ఛాంపియన్ షిప్ లో ఎవరు గెలిచారనేదే ముఖ్యం అన్నారు. ఆమె అందరికంటే ఎక్కువ కష్టపడిందని, అందుకే గెలిచిందన్నారు. సింధు ఇందుకు అర్హురాలు అని కోచ్ పార్క్ చెప్పుకొచ్చారు. మరి కోచ్ వివరణతో అయినా.. సింధుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ ఆగుతాయో లేదో చూడాలి.

PV Sindhu: సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత సింధూ.. చైనా క్రీడాకారిణిపై విజయం

కాగా.. భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధు మ‌రో టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. సింగ‌పూర్ ఓపెన్ ఫైన‌ల్లో నెగ్గిన సింధు… టైటిల్ విజేత‌గా నిలిచింది. ఆదివారం ఉద‌యం జ‌రిగిన టైటిల్ పోరులో ఆమె చైనాకు చెందిన వాంగ్ జీ యీని మ‌ట్టి క‌రిపించి విజేత‌గా నిలిచింది. 21-9, 11-21, 21-15 స్కోరుతో సింధూ ఫైనల్‌లో విజ‌యం సాధించింది.

Maria Sharapova : మగబిడ్డకు జన్మనిచ్చిన మారియా షరపోవా.. పిల్లాడి పేరు ఇదేనట..!

ఈ ఏడాదిలో ఇప్ప‌టికే రెండు టైటిళ్లు నెగ్గిన పీవీ సింధు.. తాజాగా సింగ‌పూర్ ఓపెన్ టైటిల్‌తో క‌లిపి మొత్తం మూడు టైటిళ్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. మొన్న క్వార్ట‌ర్స్ చేరిన సింధు.. సెమీస్‌ను కూడా ఈజీగానే గెలిచింది. అయితే ఫైన‌ల్ మ్యాచ్‌లో తొలి గేమ్ ను అల‌వోక‌గా గెలిచిన సింధు.. రెండో గేమ్ లో అనూహ్యంగా ఓట‌మిపాలైంది. మ్యాచ్ ఫ‌లితాన్ని నిర్దేశించే మూడో గేమ్ లో తిరిగి శ‌క్తిని కూడ‌దీసుకున్న సింధు.. త‌న ప్ర‌త్య‌ర్థి ఏమాత్రం కోలుకోకుండా మెరుపు దాడి చేసింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సింగపూర్ ఓపెన్ విజేతగా ఆవిర్భవించిన తెలుగమ్మాయి పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు శుభాభినందనలు అంటూ పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. సింధు భారత్ కు గర్వకారణమని అభివర్ణించారు. ఈ సీజన్ లో మూడో టైటిల్ గెలిచి అంతకంతకు మెరుగవుతోంది. సింధు ఇదే ఒరవడి కొనసాగించి, భారతావనికి మరింత శోభ తీసుకురావాలని ఆకాంక్షించారు. కాగా.. సింగపూర్ ఓపెన్ టోర్నీలో సింధుకు ఇదే తొలి టైటిల్. కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిళ్లు గెలిచిన తర్వాత ఈ ఏడాది ఆమె సాధించిన మూడో టైటిల్.

ట్రెండింగ్ వార్తలు