Jos Buttler: జోస్ బట్లర్‌కు ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన అశ్విన్

టీమిండియా, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ కు ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఈ సీన్ కు సంబంధించిన ఫొటో వైరల్ అయింది. మే29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రోజున అహ్మదాబాద్ లోని స్టేడియం వేదికగా జరిగింది.

Jos Buttler: జోస్ బట్లర్‌కు ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన అశ్విన్

Ipl2022

Jos Buttler: టీమిండియా, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ కు ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఈ సీన్ కు సంబంధించిన ఫొటో వైరల్ అయింది. మే29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రోజున అహ్మదాబాద్ లోని స్టేడియం వేదికగా జరిగింది.

రాజస్థాన్ జట్టు అట్టిపెట్టుకున్న ప్లేయర్లలో ఒకడైన బట్లర్‌కు వేలంలో కొనుగోలు చేసిన అశ్విన్ సంతకం పెట్టాడు. ప్రస్తుత సీజన్ లో బట్లర్ అద్భుతంగా రాణించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. సీజన్ ఆసాంతం 863పరుగులు నమోదు చేశాడు. మరోవైపు అశ్విన్ 12వికెట్లు తీసి 191నమోదు చేశాడు.

టోర్నమెంట్‌కు ముందు, క్రికెట్ అభిమానులు బట్లర్, అశ్విన్ కలిసి ఆడడాన్ని చూడాలనుకున్నారు. ఐపీఎల్ 2019 ఎడిషన్ సమయంలో నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో బట్లర్.. అశ్విన్ చేతుల్లో రనౌట్ అయ్యాడు. అది చాలా వివాదాస్పదమైంది. అయినప్పటికీ, ఇద్దరూ IPL 2022 అంతటా సన్నిహిత బంధాన్ని పెంచుకున్నారు.

Read: Also డేల్ స్టెయిన్‌ను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్

“వేలానికి ముందు బట్లర్‌తో చర్చించాం. మా ప్రాధాన్యత అతనికి తెలియజేశాం. 2019లో జరిగిన ఘటనను పట్టించుకోలేదు. బహుశా నెట్స్ లో అతనితో కలిసి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందని బట్లర్ తో చెప్పినా ఇబ్బందికరంగా ప్రవర్తించలేదు” అని సీఈఓ జాక్ లష్ మెక్రమ్ మీడియాకు వివరించారు.