రబాడ ఒట్టేశాడు.. అందుకే మ్యాచ్ గెలిచాం

రబాడ ఒట్టేశాడు.. అందుకే మ్యాచ్ గెలిచాం

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఢిల్లీని విజేతగా నిలబెట్టింది. కోల్‌కతా నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 185 పరుగులు మాత్రమే చేసి టైగా నిలిచింది. దీంతో తప్పని పరిస్థితుల్లో సూపర్ ఓవర్‌గా నిర్ణయించారు అంపైర్లు.  

సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఒక వికెట్‌ నష్టానికి 10 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత కోల్‌కతాకు రబాడ వేసిన సూపర్‌ ఓవర్లో 4, 0, ఔట్‌ (రసెల్‌), 1, 1, 1 స్కోరు మాత్రమే అంటే 7 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంపై ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇలా స్పందించాడు. 

‘సూపర్‌ ఓవర్‌ వేసే ముందు రబడతో బౌలింగ్ ఎలా వేయాలో మాట్లాడుకున్నాం. ఓవర్‌ మొత్తం యార్కర్లే మాత్రమే సంధిస్తానని రబాడ ఒట్టేశాడు. అనుకున్నట్లుగానే ప్రతి బాల్‌‌ను అద్భుతంగా యార్కర్లుగా సంధించాడు’ అని శ్రేయాస్ తెలిపాడు. ఈ విషయంపై రబాడ కూడా స్పందిస్తూ.. ఒత్తిడిలో బౌలింగ్‌ చేసి జట్టుకు విజయాన్నందించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. యార్కర్లు మాత్రమే సంధించాలనే ప్రణాళికను చక్కగా అమలు చేయగలిగానని వివరించాడు. 
 
మ్యాచ్ ప్రదర్శనపై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందిస్తూ.. మ్యాచ్‌కు ముందే లక్ష్యం చేదించే దిశలో ధాటిగా ఆడాలని బ్యాట్స్‌మెన్‌ అంత అనుకున్నాం. పృథ్వీషా బాగా ఆడాడు. అతని తన ఆటతీరు కొనసాగిస్తాడని భావిస్తున్నాం. తర్వాతి మ్యాచ్ నుంచి ఒక ఓవర్‌ మిగిలుండగానే విజయం అందుకునేలా ఆడతామని తెలిపాడు.