Rahul Dravid: “ద్రవిడ్ చేసే పనులు ఎప్పటికీ నాకు ఇన్‌స్పిరేషనే”

టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి నేర్చుకోవడాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని వెటరన్ ఇండియా బ్యాటర్ చతేశ్వర్ పూజారా అంటున్నాడు. డ్రెస్సింగ్ రూంలో వాతావరణాన్ని కాంప్లికేటెడ్ గా మారకుండా సింపుల్ ఉంచుతాడని అందుకే తానంటే ఇన్‌స్పిరేషన్ అని పేర్కొన్నాడు.

Rahul Dravid: “ద్రవిడ్ చేసే పనులు ఎప్పటికీ నాకు ఇన్‌స్పిరేషనే”

Cheteshwar Pujara

Rahul Dravid: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి నేర్చుకోవడాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని వెటరన్ ఇండియా బ్యాటర్ చతేశ్వర్ పూజారా అంటున్నాడు. డ్రెస్సింగ్ రూంలో వాతావరణాన్ని కాంప్లికేటెడ్ గా మారకుండా సింపుల్ ఉంచుతాడని అందుకే తానంటే ఇన్‌స్పిరేషన్ అని పేర్కొన్నాడు. ద్రవిడ్ హెడ్ కోచ్ అయినప్పటి నుంచి పూజారా చాలా విషయాలు నేర్చుకున్నాడు. ద్రవిడ్ డ్రెస్సింగ్ రూంలో రిలాక్స్‌డ్ వాతావరణం నెలకొల్పడమే ఇందుకు కారణం కావొచ్చు.

ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదో టెస్టుకు పూజారా కమ్ బ్యాక్ ఇవ్వడం కన్ఫామ్ అయిపోయింది. కాకపోతే శ్రీలంకతో టెస్టు సిరీస్ కు మాత్రం పూజారాను పక్కకుపెట్టేశారు. సస్సెక్స్ అనుభవంతో ఐదో టెస్టులో రాణించాలని చూస్తున్నాడు. ఇటీవల ఆడిన సస్సెక్స్ మ్యాచ్ లలో 5మ్యాచ్ లకు గానూ 720 పరుగులు సాధించాడు.

టీమిండియాతో కలిసి జూన్ 16న ఇంగ్లాండ్ చేరుకున్న పూజారా.. ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌లో ఇండియన్ టెస్ట్ టీంతో కలిసి ట్రైనింగ్ లో పాల్గొంటున్నాడు.

Read Also: అతి త్వరలో పూజారాకు రెస్ట్ ఖాయం

“రాహుల్ భయ్ నాకు ఎప్పుడూ ఇన్‌స్పిరేషనే. అతణ్ని 2007లో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇండియా టీంను లీడ్ చేస్తున్నారు. రాజ్ కోట్ వచ్చినప్పుడు చిన్న పిల్లాడిగా ఉన్న నేను ద్రవిడ్ ను కలిశా. తర్వాత ఎప్పుడూ టచ్ లోనే ఉన్నా. క్రికెటర్ గా ఆయణ్నుంచి చాలా నేర్చుకున్నా. రిటైర్ అయిన తర్వాత కూడా అతనితో కలిసి ఆడేవాడిని. ఎప్పుడూ సాయం చేసేవాడు” అని కొనియాడాడు పూజారా.

“ఎప్పుడూ సింపుల్ గా ఉంచుతాడు. బ్యాటింగ్ లో అతనికి చాలా టెక్నిక్స్ తెలుసు. అతని నుంచి నేర్చుకోవడం చాలా బాగుంటుంది కూడా. జట్టులో మంచి వాతావరణం కనిపిస్తుంది. చివరిసారిగా ఇక్కడ మేం ఆడినప్పుడు రవిశాస్త్రి భాయ్ మాతో ఉన్నారు. అద్భుతంగా ప్రదర్శన చేయగలిగాం” అని వివరించారు.