Virat Kohli: అతని గురించి గొప్పగా మాట్లాడలేకపోయా.. కోహ్లీతో కలిసి పనిచేయడం హ్యాపీ

టీమిండియా - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మ్యాచ్ కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ద్రవిడ్.. కోహ్లీని తెగపొగిడేస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టెస్టు కెప్టెన్...

Virat Kohli: అతని గురించి గొప్పగా మాట్లాడలేకపోయా.. కోహ్లీతో కలిసి పనిచేయడం హ్యాపీ

Virat Kojoli

Virat Kohli: టీమిండియా – దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మ్యాచ్ కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ద్రవిడ్.. కోహ్లీని తెగపొగిడేస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎబిలిటీ, కెప్టెన్సీ అంశాలపై కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.

‘విరాట్ కోహ్లీ కచ్చితంగా నాయకుడే. పిచ్ మీద ఉన్నప్పుడు చుట్టూ ఒక రకమైన వాతావరణం కనిపిస్తుంటుంది. అతని గురించి గొప్పగా మాట్లాడలేకపోయా. అతనితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అతని ప్రాక్టీస్, అంకితభావం చూసి భారీగా పరుగులు వస్తాయని ఆశిస్తున్నా. ఈ క్రెడిట్ మొత్తం టీమ్ కే చెందుతుంది’ అంటున్నారు హెడ్ కోచ్.

కోహ్లీ తిరిగి ఫామ్ సంపాదిస్తారని.. సెంచరీలు మళ్లీ నమోదు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు కోహ్లీ.

ఇది వీక్షించండి: శ్రద్ధా అందాలతోనే మర్డర్ చేస్తే ఎలా?!

నవంబరులో ద్రవిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి విదేశీ పర్యటన దక్షిణాఫ్రికా టూర్. ఇప్పటికే ద్రవిడ్ నేతృత్వంలో ముగిసిన టీ20 సిరీస్ ను టీమిండియా 3-0తేడాతో వైట్ వాష్ చేసింది. ప్రస్తుత పర్యటనలో తొలి టెస్టు మ్యాచ్ ను 113పరుగుల తేడాతో గెలిచింది కోహ్లీసేన.