Virat Kohli: విరాట్ బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెట్టిన ద్రవిడ్

దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ చేస్తున్న ఇండియన్ క్రికెటర్లు మూడో రోజు చెమటోడ్చారు. నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో...

Virat Kohli: విరాట్ బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెట్టిన ద్రవిడ్

Virat Kohli

Virat Kohli: దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్ చేస్తున్న ఇండియన్ క్రికెటర్లు మూడో రోజు చెమటోడ్చారు. నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే రాహుల్ ద్రవిడ్ ఫోకస్ అంతా ఉన్నట్లు కనిపిస్తుంది. డిసెంబర్ 26న జరిగే బాక్సింగ్ డే టెస్టులో గెలిచేందుకు కోహ్లీని మరింత సన్నద్ధంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు.

కోహ్లీ రెడ్ బాల్ క్రికెట్ లో చివరి రెండేళ్లుగా.. ఆడిన 13టెస్టుల్లో యావరేజ్ 26ఉంటే బెస్ట్ 74గా కనిపిస్తుంది. కోహ్లీ రికార్డ్ ప్రకారం.. అతని యావరేజ్ 50గా ఉంది. నవంబర్ 2019లో జరిగిన డే అండ్ నైట్ టెస్టులోనూ బంగ్లాదేశ్ పై సెంచరీ బాదాడు కోహ్లీ.

టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 12స్టేజిలోనే భారత జట్టు నిష్క్రమించడంతో కోహ్లీ కెప్టెన్సీ నుంచి విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్.. అది కూడా దక్షిణాఫ్రికా గడ్డపైనే. దాని కోసమే ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు విరాట్.

………………………… : ఇవాళ అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

రోహిత్ శర్మకు గాయం కావడంతో మ్యాచ్ కు హాజరుకాలేకపోతున్నాడు. కగిసో రబాడ, నార్ట్జే లాంటి ఫేసర్లను ఎదుర్కోవడానికి టీమిండియా సిద్ధమవుతూనే బుమ్రా, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మలను సిద్ధం చేస్తుంది.

వికెట్ కీపర్లు వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ లు సమంగా ప్రాక్టీస్ చేస్తూ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటున్నారు. ప్రియాంక్ పంచల్ రోహిత్ రీప్లేస్ మెంట్ గా కనిపిస్తుండగా బ్యాట్ తో ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. కొవిడ్-19 జాగ్రత్తల రీత్యా సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు అభిమానులు లేకుండానే నిర్వహిస్తారు.

…………………………….. : ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి ఏపీ ప్రభుత్వ రుణాలు : కేంద్రం