సిరీస్‌పై భారత్ గురి : సిడ్నీ టెస్టు..రాహుల్ అవుట్

  • Published By: madhu ,Published On : January 3, 2019 / 01:29 AM IST
సిరీస్‌పై భారత్  గురి : సిడ్నీ టెస్టు..రాహుల్ అవుట్

సిడ్నీ : ఆసీస్‌తో  భారత్‌ నాలుగో టెస్ట్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన ఇండియా.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే కంగారూల గడ్డపై ఈ టెస్ట్‌లో భారత్ గెలిచినా, డ్రా చేసుకున్నా చరిత్రే అవుతుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో అడిలైట్‌లో గెలిచి, పెర్త్‌లో బోల్తా కొట్టి, మెల్‌బోర్న్‌ విజయంతో టీమ్‌ ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. 
అగర్వాల్ శుభారంభం…
భారత ఓపెనర్ అగర్వాల్ శుభారంభం ఇచ్చినా రాహుల్ విఫలం చెందాడు. కేవలం 9 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. అగర్వాల్‌కు పూజారా జత కలిశాడు. వీరిద్దరూ మెల్లిగా ఆడుతూ రన్లను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 22 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి భారత్ 65 పరుగులు చేసింది. అగర్వాల్ 40, పుజారా 14 రన్లతో ఆడుతున్నారు.

వైదొలిగిన ఇషాంత్…
కంగారూ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ గెలవాలన్న కాంక్షను నిజం చేసుకునేందుకు టీమిండియా తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌కోసం టీమ్ ఇండియా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసకుంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సాధించాలని   సారధి విరాట్‌ కోహ్లీ భావిస్తున్నాడు. అయితే భారత్‌ ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ  వైదొలిగాడు. ఇక బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో గత ఏడాది అవమానాలపాలైన ఆస్ట్రేలియా ఈ టెస్ట్‌ విజయంతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా మొదలుపెట్టాలని పట్టుదలగా ఉంది.