India vs South africa: నేటి మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. ఆలస్యంగా ప్రారంభం కానున్న తొలి వన్డే
వర్షం కారణంగా తొలి వన్డే ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ వివరాలు తెలిపింది. ‘‘లక్నోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. టాస్ అరగంట ఆలస్యంగా వేయాలని నిర్ణయించారు. దీంతో ఇవాళ టాస్ మధ్యాహ్నం 1.30 గంటలకు వేసి, మ్యాచ్ ను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారు’’ అని బీసీసీఐ ట్విటర్ లో తెలిపింది.

India vs South africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నేటి మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారుతోంది. ముందుగా నిర్ణయించాల్సిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా తొలి వన్డే ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ వివరాలు తెలిపింది.
‘‘లక్నోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. టాస్ అరగంట ఆలస్యంగా వేయాలని నిర్ణయించారు. దీంతో ఇవాళ టాస్ మధ్యాహ్నం 1.30 గంటలకు వేసి, మ్యాచ్ ను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారు’’ అని బీసీసీఐ ట్విటర్ లో తెలిపింది. కాగా, దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా గెలుచుకుంది.
నేటి నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వన్డే ఈ నెల 9న, మూడవ వన్డే ఈ నెల 11న జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం టీమిండియా టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా బయలుదేరనుంది. దక్షిణాఫ్రికాతో నేటి నుంచి వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా అందుకు సన్నద్ధం అవుతున్న వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది.
Preps ✅#TeamIndia ready for the #INDvSA ODI series. ? ? pic.twitter.com/5fY3m1a8lq
— BCCI (@BCCI) October 6, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..