RCB vs GT: బ్యాడ్‌న్యూస్‌.. ఆర్‌సీబీకి వ‌రుణ గండం.. ప్లే ఆఫ్స్ చేరేనా..?

ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఆదివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది.

RCB vs GT: బ్యాడ్‌న్యూస్‌.. ఆర్‌సీబీకి వ‌రుణ గండం.. ప్లే ఆఫ్స్ చేరేనా..?

మ్యాచ్‌కు వ‌రుణుడి ముప్పు

RCB vs GT – IPL 2023: ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఆదివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో గుజ‌రాత్ టైటాన్స్‌ (Gujarat Titans)తో రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Bangalore) జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే గుజ‌రాత్ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కు చేరిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా ఆ జ‌ట్టుకు పెద్ద‌గా న‌ష్టం ఏమీ ఉండ‌దు. అయితే.. బెంగ‌ళూరు జ‌ట్టుకు మాత్రం ఈ మ్యాచ్ కీల‌కం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరే అవ‌కాశం ఉంది. ఓడిపోతే ఇక అంతే సంగ‌తులు.

ఈ నేప‌థ్యంలో టేబుల్ టాప‌ర్ అయిన గుజ‌రాత్ పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆ జ‌ట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇంకొంద‌రు అయితే ఏకంగా పూజ‌లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని ఓ విష‌యం క‌ల‌వ‌ర పెడుతోంది. అదే వాతావ‌ర‌ణం. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడి ముప్పు పొంచి ఉంది. వాతావ‌ర‌ణ శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో వ‌ర్షం కురిసే అవ‌కాశాలు 65 శాతం వ‌ర‌కు ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

IPL 2023: ప్లే ఆఫ్‌కు చేరే నాలుగో జట్టు ఏది? ముక్కోణపు పోటీలో విజేత ఎవరు? అలా జరిగితే రాజస్థాన్ దూసుకెళ్లినట్లే..

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ విష‌యం తెలిసిన అభిమానులు కంగారు ప‌డుతున్నారు. ఒక వేళ వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్దు అయితే ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింటును ఇస్తారు. అప్పుడు బెంగ‌ళూరు 15 పాయింట్ల‌తో ఉంటుంది. అదే స‌మ‌యంలో స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో ముంబై విజ‌యం సాధిస్తే 16 పాయింట్ల‌తో రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. అందుక‌నే వ‌ర్షం ప‌డ‌కుండా మ్యాచ్ స‌జావుగా జ‌రిగి, బెంగ‌ళూరు విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాల‌ని స‌గ‌టు ఆర్‌సీబీ అభిమాని కోరుకుంటున్నారు.

IPL 2023: స‌న్‌రైజ‌ర్స్‌తో ఉమ్రాన్ మాలిక్ గొడ‌వ ప‌డ్డాడా..? అందుకే తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌డం లేదా..?