RR vs SRH : కెప్టెన్ మారినా హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు

RR vs SRH : కెప్టెన్ మారినా హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు

Rajasthan (1)

RR vs SRH: వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ మారినా విజయం వరించలేదు. డేవిడ్ వార్నర్‌ను తప్పించి కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌ను చేసిన ఫస్ట్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.

టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 221 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు మనీశ్ పాండే 31, జానీ బెయిర్ స్టో 30 పరుగులు చేశారు. కెప్టెన్ విలియమ్సన్ 20 పరుగులు చేయగా.. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 3, క్రిస్ మోరిస్ 3 వికెట్లు తీశారు.

అంతకుముందు, జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగగా.. కేవలం 64 బంతుల్లో 124 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ 14లో ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ సాధించిన మూడో విజయం ఇది.