IPL 2019: రాజస్థాన్ దశాబ్ద కాల దాహం తీరనుందా?

IPL 2019: రాజస్థాన్ దశాబ్ద కాల దాహం తీరనుందా?

వరుస వైఫల్యాలు.. ఒకటి కాదు రెండు కాదు.. పదేళ్లుగా టైటిల్ కాంక్ష. 2018లో భారీ స్థాయిలో జరిగిన వేలం తర్వాత టైటిల్ కొట్టేయాలనేంత కసిలో కనిపించింది రాజస్థాన్ రాయల్స్. కానీ, బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టార్ ప్లేయర్ లీగ్‌ నుంచి ఆ స్టార్ ప్లేయర్ దూరమైయ్యాడు. అజింకా రహానె బాధ్యతలు తీసుకున్నప్పటికీ జట్టును ప్లేఆఫ్ మ్యాచ్ ల వరకూ కూడా దాటించలేకపోయాడు. 

మ్యాచ్ ఫిక్సింగ్ నిషేదం నుంచి తేరుకున్న తొలి ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిస్తే.. రాజస్థాన్ రాయల్స్ పేలవంగానే మిగిలింది. ఈ సారి స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ మళ్లీ రావడం జట్టులో బలమైన ఆశలు పుట్టేలా చేస్తున్నాయి. ఐసీసీ వరల్డ్ కప్ 2019కు ఆస్ట్రేలియా కీలక బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దూకనున్న స్మిత్.. రాజస్థాన్ రాయల్స్‌ను ఏ పాటిలో నిలబెడతాడో చూడాలి. 
Read Also : అదే డబ్బును ఇలా: బీసీసీఐ రూ.20 కోట్లు ఇవ్వనుంది
 
మార్చి 25న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌ను సవాయ్ మన్‌సింగ్ స్టేడియం వేదికగా ఆడనుంది. ఈ సీజన్‌కు ఒషానే థామస్, లియామ్, లివింగ్ స్టోన్‌లతో పాటు జట్టులో మార్పులు చేసిన రాజస్థాన్ 2008 నాటి వైభవాన్ని మళ్లీ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. 

రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు:
అజింకా రహానె(కెప్టెన్), స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, ప్రశాంత్ చోప్రా, మనన్ వోహ్రా, ఆర్యమాన్ బిర్లా, రాహుల్ త్రిపాఠీ, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బిన్నీ, శ్రేయాస్ గోపాల్, కృష్ణప్ప గౌతం, శశాంక్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, శుభం రంజనె, ఆష్టన్ టర్నర్, రియాన్ పరాగ్, మహిపాల్ లామ్రార్, ఇష్ సౌథీ, జయదేశ్ ఉన్‌దక్త్, ధావల్ కుల్‌కర్ణి, వరుణ్ ఆరోన్, ఒషానె థామస్, సుధేశాన్ మిథున్

కోచ్: పాడీ ఉప్టన్
బ్యాటింగ్ కోచ్: అమోల్ మజుందార్
బౌలింగ్ కోచ్: స్టెఫాన్ జోన్స్, సాయిరాజ్ బహుతులె
ఫీల్డింగ్ కోచ్: దిశాంత్ యగ్నిక్
ఫిజియోథెరఫిస్ట్: జోన్ గ్లోస్టర్
Read Also : నువ్వు తోపు బాసూ : 2020 వరకు రవిశాస్త్రినే