Ram paid 500rs fine: రామ్.. దశరథుని కొడుక్కి రూ.500 ఫైన్, గవర్నమెంట్ కు డబ్బులొచ్చాయంతే..

దశరథుని కొడుకైన రాముడికి రూ.500 ఫైన్ విధించారు కేరళ పోలీసులు. సీట్ బెల్టు లేకుండా డ్రైవ్ చేస్తున్నందుకు జరిమానా విధించామని రశీదులో పేర్కొన్నారు.

Ram paid 500rs fine: రామ్.. దశరథుని కొడుక్కి రూ.500 ఫైన్, గవర్నమెంట్ కు డబ్బులొచ్చాయంతే..

Ram Paid Rs 500

Ram paid 500rs fine: దశరథుని కొడుకైన రాముడికి రూ.500 ఫైన్ విధించారు కేరళ పోలీసులు. సీట్ బెల్టు లేకుండా డ్రైవ్ చేస్తున్నందుకు జరిమానా విధించామని రశీదులో పేర్కొన్నారు. కొల్లాం జిల్లాలోని చదయ్‌మంగళంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోలో రికార్డ్ అయిన ఫుటేజి ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

తనను రాముడిగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. ఆ రశీదులో కూడా అవే వివరాలు చెప్పాడు. ప్యాసింజర్ చెప్తున్న పేర్లు గమ్మత్తుగా ఉన్నా గవర్నమెంట్ కు డబ్బులు రావడం కావాలి జరిగిపోయింది కదా అని చెప్పాడు ప్రభుత్వాధికారి. అతను సీట్ బెల్టు లేకుండా కనిపించడంతో ఫైన్ రాసి అందులో ఏం పేరు రాయాలని అడిగితే ఇలా చెప్పాడు.

కొద్ది క్షణాల పాటు ఆలోచించి తన పేరు రామన్ (రామ్) అని చెప్పి తండ్రి పేరు అడిగితే దశరథుడు అని తాను అయోధ్య నుంచి వచ్చానని చెప్పాడు. అదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి రసీదు స్క్రీన్ షాట్ కూడా అందులో ఉంచాడు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారని కేరళ పోలీసులు జరిమానాలు ఎక్కువగా వేస్తుండటంతో ఇలా జరిగిందని కామెంట్లు చేస్తున్నారు.

…………………………………………………: ఎంఎస్ ధోనీ తెగ కష్టపడ్డాడు – గౌతం గంభీర్

మూడు నెలల కొవిడ్-19 లాక్ డౌన్ తర్వాత కేరళ పోలీసులు 17.75లక్షల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. జరిమానాల కింద రూ.125కోట్లు వసూలు చేశారు. ఇవే కాకుండా మాస్కుల్లేకుండా ప్రయాణించే వారి నుంచి 10.7లక్షల మందికి ఫైన్ విధించారు. 4.7లక్షల మంది సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం లేదని కేసులు నమోదు చేశఆరు.

మాస్కుల్లేని వారి నుంచి రూ.54.88కోట్లు వసూలయ్యాయి. కేవలం ఆగష్టు తొలి వారంలోనే రూ.5.15కోట్లు వచ్చిపడ్డాయి.