Ranveer Singh 83: సినిమాలో హైలెట్ సీన్ అదే.. వెంట్రుకలు నిక్కబొడుచుకునే టీజర్

అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా 1983లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఏ మాత్రం అంచనాల్లేని జట్టును విజయం దిశగా నడిపించారు కపిల్ దేవ్. ఈ ఫీట్ సాధించడం అంత తేలికగా జరగలేదు.

Ranveer Singh 83: సినిమాలో హైలెట్ సీన్ అదే.. వెంట్రుకలు నిక్కబొడుచుకునే టీజర్

Kapil Dev 83

Ranveer Singh 83: అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా 1983లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఏ మాత్రం అంచనాల్లేని జట్టును విజయం దిశగా నడిపించారు కపిల్ దేవ్. ఈ ఫీట్ సాధించడం అంత తేలికగా జరగలేదు. ఎన్నో ట్విస్ట్‌లతో కూడి.. అసాధారణ ప్రయాణాన్ని సాగించారు. ఈ మొత్తాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న ప్రయోగమే.. `83`.

అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ మూవీని నిర్మించారు.

క‌పిల్ దేవ్‌గా ర‌ణ్వీర్ సింగ్‌, క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె, సునీల్ గ‌వాస్క‌ర్‌గా తాహిర్ రాజ్ బాసిన్‌, కృష్ణ‌మాచార్య శ్రీకాంత్‌గా జీవా, మ‌ద‌న్ లాల్‌గా హార్డీ సందు, మ‌హీంద్ర‌నాథ్ అమ‌ర్‌నాథ్‌గా స‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సంధుగా అమ్మి విర్క్‌, వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్ క‌త్తార్‌, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారె, ర‌విశాస్త్రిగా కార్వా.. మేనేజ‌ర్ మాన్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠి కనిపించనున్నారు.

…………………………………………… : మూడు లక్షల టికెట్లు 16 నిమిషాల్లో అయిపోయాయి

జూన్ 25, 1983న జరిగిన వెస్టిండీస్.. ఇండియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను హైలెట్ గా చూపించారు. ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ క్యాచ్‌ను గేమ్ మలుపు తిప్పింది. కెప్టెన్ కపిల్ దేవ్ క్యాచ్ కోసం 20 గజాల దూరం వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకోవడం విశేషం. ఆ క్యాచ్ సీన్ టీజర్‌లో అద్భుతంగా చూపించారు.

’83’తో డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది.