Free Hit Rule : ఆ నిబంధన.. క్రికెట్ చరిత్రలోనే పరమ చెత్తది, అవినీతికి ద్వారం తెరిచినట్టే

ఫ్రీ హిట్.. ఈ నిబంధన గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వికెట్‌ కోల్పోతామనే భయం లేకుండా బ్యాట్స్ మెన్ ఆడే షాట్ ఫ్రీ హిట్‌. ముందు బాల్‌ నో బాల్‌ అయితే ఆ తర్వాత బంతిని ఫ్రీహిట్‌గా పరిగణిస్తున్నారు. సుమారు ఆరేళ్లుగా ఈ రూల్‌ అమలవుతోంది. 2015లో తొలిసారి ఈ నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టగా, అప్పట్నుంచి అది బ్యాటర్స్‌కు వరంగా మారింది.

Free Hit Rule : ఆ నిబంధన.. క్రికెట్ చరిత్రలోనే పరమ చెత్తది, అవినీతికి ద్వారం తెరిచినట్టే

Free Hit Rule

Free Hit Rule : ఫ్రీ హిట్.. ఈ నిబంధన గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వికెట్‌ కోల్పోతామనే భయం లేకుండా బ్యాట్స్ మెన్ ఆడే షాట్ ఫ్రీ హిట్‌. ముందు బాల్‌ నో బాల్‌ అయితే ఆ తర్వాత బంతిని ఫ్రీహిట్‌గా పరిగణిస్తున్నారు. సుమారు ఆరేళ్లుగా ఈ రూల్‌ అమలవుతోంది. 2015లో తొలిసారి ఈ నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టగా, అప్పట్నుంచి అది బ్యాటర్స్‌కు వరంగా మారింది.

కాగా, ఈ నిబంధనపై విమర్శలు వస్తున్నాయి. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత పరమ చెత్త నిబంధన అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు పాకిస్తాన్‌ మాజీ వికెట్‌ కీపర్‌ రషీద్‌ లతీఫ్‌ తీవ్ర విమర్శలు చేశారు. అసలు నో బాల్‌కు ఫ్రీ హిట్‌ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అసలే బ్యాట్స్‌మన్‌ గేమ్‌గా మారిపోయిన క్రికెట్‌లో ఈ నిబంధన అర్థం లేనిదని మండిపడ్డారు.

”అదనంగా పరుగు వస్తున్నప్పుడు ఫ్రీ హిట్‌ అనే నిబంధన అవసరం లేదు. క్రికెట్‌ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రూల్‌. ఈ తరహా నిబంధన వల్ల అవినీతికి ద్వారం సులువుగా తెరిచినట్లే” లతీఫ్‌ ధ్వజమెత్తారు. ఒక బౌలర్‌ ఈజీగా నో బాల్‌ వేసే అవకాశం ఉంటుందని, దాన్నే ఫిక్సింగ్‌ కూడా వాడుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన లతీఫ్, ఐసీసీకి ట్యాగ్‌ చేశారు.