Young Players: యువ ఆటగాళ్లతో టీమిండియా.. తొలిసారి రవికి చోటు!

వన్డే, టెస్ట్ సిరీస్‌లలో ఓటమి తర్వాత.. ఇప్పుడు టీమిండియా వెస్టిండీస్‌పై సిరీస్ ఆడబోతుంది.

Young Players: యువ ఆటగాళ్లతో టీమిండియా.. తొలిసారి రవికి చోటు!

Ravi Bishnoi

Young Players: వన్డే, టెస్ట్ సిరీస్‌లలో ఓటమి తర్వాత.. ఇప్పుడు టీమిండియా వెస్టిండీస్‌పై సిరీస్ ఆడబోతుంది. వెస్టిండీస్‌తో జరిగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈసారి చాలా మంది యువ ఆటగాళ్లు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అత్యంత షాకింగ్ పేరు రవి బిష్ణోయ్. తొలిసారి టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. రవితో పాటు అవేష్ ఖాన్, హర్షల్, దీపక్ హుడా కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఫిబ్రవరి 6వ తేదీ నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం రవి బిష్ణోయ్, దీపక్ హుడా, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్‌లను జట్టులోకి తీసుకున్నారు. ఈ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే, వారు చాలా ప్రభావవంతంగా కనిపిస్తున్నారు. ఈ ఆటగాళ్లంతా దేశవాళీ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ కారణంతోనే వారికి టీమిండియాలో చోటు దక్కింది.

స్పిన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌ కెరీర్‌ను పరిశీలిస్తే.. లిస్ట్‌ ఏలో 17 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు తీశాడు. 42 టీ20 మ్యాచుల్లో 49 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు మెంబర్‌గా ఉన్నాడు రవి బిష్ణోయ్. దీపక్ హుడా ఆల్ రౌండర్ కాగా.. అతను లిస్ట్ ఎలో 74 మ్యాచ్‌ల్లో 2257 పరుగులు చేశాడు. 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 2908 పరుగులు చేశారు. ఈ ఫార్మాట్‌లో 9 సెంచరీలు చేశాడు.

ఐపీఎల్, దేశవాళీ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన హర్షల్ పటేల్.. టీమ్ ఇండియా తరఫున 2 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో పటేల్ 4 వికెట్లు తీశాడు. లిస్ట్ ఎలో 60 మ్యాచ్‌ల్లో 84 వికెట్లు, 64 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 226 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఏలో 17 వికెట్లు, టీ20లో 65 వికెట్లు తీశాడు.

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ కోసం యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 21 ఏళ్ల రవి బిష్ణోయ్ తొలిసారి జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. రవి బిష్ణోయ్ భారత అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో అవకాశం దక్కింది. 23 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయ్ ఐపీఎల్ 2022లో లక్నో టీమ్‌లో మెంబర్‌గా ఉండబోతున్నాడు.

Also Read: India’s squad: వెస్టిండీస్‌తో సిరీస్‌కి టీమిండియాని ప్రకటించిన బీసీసీఐ