రవిశాస్త్రి ఏజ్ ఎంత..120 ఏళ్లా ? గూగుల్ ఆన్సర్!

రవిశాస్త్రి ఏజ్ ఎంత..120 ఏళ్లా ? గూగుల్ ఆన్సర్!

Ravi shastri age : టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఏజ్ ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తోంది. ఆయన వయస్సు 120 ఏళ్లు అని సమాధానం ఇస్తోంది గూగుల్. ఏ చిన్న సమాచారం కావాలన్నా..గూగుల్ ను ఆశ్రయిస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా..గూగుల్ తప్పుడు సమాధానం చెప్పే వరకు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ టీమిండియా ప్లేయర్ గా వ్యవహరించిన రవిశాస్త్రి..గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే..ఆయన క్రికేటర్ గా, టీమిండియా కోచ్ గా రాణించారు. ఈయన…1962 మే 27వ తేదీన జన్మించారు (వికీపడియా). ప్రస్తుతం ఈయన వయస్సు 58 ఏళ్లు. కానీ..రవిశాస్త్రి వయస్సు అని ఇంగ్లీషులో గూగుల్ లో టైప్ చేసి సెర్చ్ చేస్తే…1900, మే 27వ తేదీన జన్మించాడని చూపిస్తోంది. దీంతో నెటిజన్లు సరదా సరదా..కామెంట్స్ చేస్తున్నారు. గూగుల్ పప్పులో కాలేసింది..అంటూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం టీమిండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ నడుస్తోంది. మొదటి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ షురూ కావడానికి ముందు..టీమిండియా ప్లేయర్లు విస్తృతంగా ప్రాక్టీస్ చేశారు. సెషన్ మొదలయ్యే ముందు…టీమ్ ను ఉద్దేశించి..శాస్త్రి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను బీసీసీఐ త‌న ట్విట‌ర్ హ్యాండిల్‌‌లో పోస్ట్ చేసింది. త‌న ఉత్తేజ‌భ‌రిత ప్ర‌సంగంతో ర‌విశాస్త్రి టీమ్‌కు వెల్‌క‌మ్ చెప్పాడ‌ని బీసీసీఐ ఈ సంద‌ర్భంగా కామెంట్ చేసింది.