Ravi Shastri : ఐసోలేషన్‌లో ఒక్క పారాసిటమాల్ వేసుకోలేదు – రవిశాస్త్రి

తాను హోం ఐసోలేషన్ లో ఉన్న సమయంలో ఒక్క పాసిటమాటల్ కూడా వేసుకోలేదన్నారు టీమిండియా కోచర్ రవిశాస్త్రి.

Ravi Shastri : ఐసోలేషన్‌లో ఒక్క పారాసిటమాల్ వేసుకోలేదు – రవిశాస్త్రి

Ravi

Ravi Shastri Covid : తాను హోం ఐసోలేషన్ లో ఉన్న సమయంలో ఒక్క పాసిటమాటల్ కూడా వేసుకోలేదన్నారు టీమిండియా కోచర్ రవిశాస్త్రి. ఇంగ్లండ్ లో పది రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్నట్లు, పది రోజుల్లో తనకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని చెప్పుకొచ్చారు. ఆక్సిజన్ లెవల్స్ 99 శాతం ఉన్నట్లు చూపించిందని, అధిక జ్వరం కూడా రాలేదన్నారు. తాను మందులు ఏమీ వాడలేదని తెలిపారు. తాను ఏం సాధించాలని అనుకున్నానో…అన్నీ సాధించినట్లు, టెస్టు క్రికెట్ లో ఇండియాను ఐదేళ్ల పాటు నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి కృషి చేయడం జరిగిందన్నారు.

Read More : General Sherman tree : 2,300 ఏళ్ల వయస్సున్న భారీ వృక్షానికి అల్యూమినియం కవర్

ఓవల్ నాలుగో టెస్టు మ్యాచ్ కు ముందు రవిశాస్త్రి, ఇతరులు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. మరో ఇద్దరు టీమిండియా సిబ్బంది కూడా వైరస్ సోకింది. దీంతో రవిశాస్త్రిపై పలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో..ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. ఎవరైనా ఆహ్వానించిన అనంతరం అక్కడ ఎక్కువ సేపు ఉండవద్దని, టీ 20 వరల్డ్ కప్ అద్బుతమని అనుకున్నట్లు…దానికన్నా ఎక్కువే సాధించడం జరిగిందన్నారు.

Read More : Bengaluru Tragedy :ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..ఆకలితో అల్లాడి చనిపోయిన పసిబిడ్డ

ఆస్ట్రేలియాను సొంత దేశంలో రెండుసార్లు ఓడించామనే విషయాన్ని ప్రస్తావించారు. ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో లీడ్ ఉన్న విషయాన్ని మైఖేల్ అర్థటన్ కు చెప్పినట్లు తెలిపారు. దుబాయ్ లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత…కోచింగ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది.