WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్‌..! ఒక్కొక్క‌రుగా గాయ‌ప‌డుతుంటే ఆడేది ఎవ‌రు..?

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు ముందు టీమ్ఇండియాకు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. కీల‌క ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రుగా గాయ‌ప‌డుతున్నారు.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్‌..! ఒక్కొక్క‌రుగా గాయ‌ప‌డుతుంటే ఆడేది ఎవ‌రు..?

Team India

Ravichandran Ashwin: ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌(WTC Final )కు ముందు టీమ్ఇండియా(Team India)కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. కీల‌క ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రుగా గాయ‌ప‌డుతున్నారు. పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌(Rishabh Pant), మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయస్ అయ్య‌ర్(Shreyas Iyer) లు జ‌ట్టును ఎంపిక చేయ‌క‌ముందే గాయాల కార‌ణంగా దూరం అయిన సంగ‌తి తెలిసిందే. జ‌ట్టును ప్ర‌కటించిన త‌రువాత స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్(KL Rahul) ఐపీఎల్‌లో గాయ‌ప‌డి దూరం కాగా అత‌డి స్థానంలో యువ ఆట‌గాడు ఇషాన్ కిష‌న్‌(Ishan Kishan)కు అవ‌కాశం క‌ల్పించారు.

ఇంకోవైపు శార్దూల్ ఠాకూర్‌, జ‌య‌దేశ్ ఉన‌ద్క‌త్ ల‌ గాయాల నుంచి కోలుకున్నారా..? కోలుకుంటే ఫిట్‌నెస్ సాధించారా లేదా అన్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. ఈ షాక్‌ల నుంచి ఇంకా తేరుకోక‌ముందే టీమ్ఇండియాకు మ‌రో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ చేరాడు. ప్ర‌స్తుతం అత‌డు వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్నాడు.

WTC Final 2023: యువ ఆట‌గాడికి బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. గాయ‌ప‌డిన కేఎల్ రాహుల్ స్థానంలో ఛాన్స్‌

ఐపీఎల్‌లో అశ్విన్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ఆడుతున్నాడు. శుక్ర‌వారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఆడ‌లేదు. టాస్ సంద‌ర్భంగా రాజ‌స్థాన్ కెప్టెన్ సంజు శాంస‌న్ మాట్లాడుతూ అశ్విన్ వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్నాడ‌ని చెప్పాడు. అందుక‌నే చివ‌రి నిమిషంలో జ‌ట్టులో మార్పులు చేయాల్సి వ‌చ్చింద‌న్నాడు. ఈ విష‌యం తెలిసిన అశ్విన్ అభిమానులు అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

కాగా.. అశ్విన్ గాయం తీవ్ర‌త గురించి ఇంకా తెలియ‌రాలేదు. బీసీసీఐ ఇప్ప‌టికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తోంది. గాయం మ‌రీ తీవ్ర‌మైనది అయితే అత‌డు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అదే జ‌రిగితే క‌నీసం రెండో ప్ర‌య‌త్నంలో అయినా ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్ టైటిల్‌ను గెల‌వాల‌ని బావిస్తున్న టీమ్ఇండియాకు ఇది నిజంగా గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

WTC Final: రెహానే వచ్చేశాడు..! డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ

లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో జూన్ 7 నుంచి 12 వ‌ర‌కు భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

WTC ఫైనల్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మ‌హమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్‌)

స్టాండ్‌బై ఆటగాళ్లు: రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.

WTC Final 2023: అంద‌రూ ఐపీఎల్ ఆడుతుంటే.. అత‌డు మాత్రం డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం ఇంగ్లాండుకు

WTC ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు:

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బొలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ ల‌బుషేన్‌, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్‌ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్, మాట్ రెన్షా