జడేజా అరుదైన ఘనత : టెస్టుల్లో 200 వికెట్ల క్లబ్‌లో చోటు

  • Published By: sreehari ,Published On : October 4, 2019 / 11:06 AM IST
జడేజా అరుదైన ఘనత : టెస్టుల్లో 200 వికెట్ల క్లబ్‌లో చోటు

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 39/3తో మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ లో విజృంభించారు. ఓపెనర్లు డీన్ ఎల్గర్ (287 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్స్) 160 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. భారత బౌలర్లను దాడిని ధీటుగా ఎదుర్కొంటూ ఎల్గర్ పరుగుల వరద పారించాడు.

99.3 ఓవర్ లో బంతి అందుకున్న జడేజా.. ఎల్గర్ దూకుడకు కళ్లెం వేశాడు. అతడు షాట్ ఆడిన బంతిని చతేశ్వర పుజారా పరిగెత్తి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఎల్గర్ నిష్ర్కమించక తప్పలేదు. ఎల్గర్ ను ఔట్ చేయడంతో జడేజా టెస్టు కెరీర్‌లో తన 200 వికెట్ మార్క్ దాటేశాడు. తద్వారా టెస్టుల్లో 200 వికెట్లు తీసిన వేగవంతమైన ఎడమ చేతి బౌలర్ల క్లబులో జడేజా చేరాడు. భారతీయ బౌలర్ల జాబితాలో జడేజా (37 మ్యాచ్ లు ఆడి) రెండో వేగవంతమైన ఎడమ చేతి బౌలర్ గా నిలిచాడు.

జడేజా తన 44వ టెస్టు మ్యాచ్ లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు. మూడో రోజు ఫాలో ఆన్ మ్యాచ్ లో  సౌతాఫ్రికా జట్టు డ్రింక్స్ ముగిసిన అనంతరం 109.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. డీకాక్ (111) సెంచరీ చేసి జడేజా బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ముత్తు సామీ (5), ఫిలాండర్ (0) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.

ఇండియన్ బౌలర్లలో అశ్విన్ ఏకంగా 5 వికెట్లు తీసుకోగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్ల నష్టానికి 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. దక్షిణాఫ్రికా ఇంకా 132 పరుగులు వెనుకబడి ఉంది.