India vs Bangladesh Test Series: బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు ఆ ముగ్గురు ప్లేయర్స్ దూరమైనట్లేనా? అసలు విషయం ఏమిటంటే?

జడేజా, మహ్మద్ షమీల స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను భర్తీచేసే అవకాశం ఉంది. సౌరభ్, సైనీ ఇద్దరూ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఇండియా ఏతో పర్యటనలో ఉన్నారు.

India vs Bangladesh Test Series: బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు ఆ ముగ్గురు ప్లేయర్స్ దూరమైనట్లేనా? అసలు విషయం ఏమిటంటే?

India vs Bangladesh Test Series

India vs Bangladesh Test Series: టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ప్రస్తుతం వన్డే మ్యాచ్ ఆడుతుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తికాగా ఆ రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోయింది. 10న మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. 14 నుంచి చటోగ్రామ్‌లో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్‌కు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. చివరిలో బ్యాటింగ్‌కు వచ్చినా అతని వేలుకు తగిలిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను టెస్ట్ సిరీస్‌లో పాల్గొనే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. అయితే, రోహిత్ గాయంపై బీసీసీఐ తాజాగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

Bangladesh vs India: బొటనవేలుకి కట్టుకట్టించుకుని వచ్చి 5 సిక్సులతో రోహిత్ మెరుపులు.. ప్రశంసల జల్లు

రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ ప్రస్తుతానికి ఫిట్ గా ఉండేందుకు పోటీపడుతున్నారు. గాయాలతో ఇద్దరు ఆటగాళ్లు వన్డే సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ లో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు షమీ భుజం గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వారిద్దరు టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

Bangladesh vs India: రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి.. సిరీస్‌ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్

జడేజా, మహ్మద్ షమీల స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను భర్తీచేసే అవకాశం ఉంది. సౌరభ్, సైనీ ఇద్దరూ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఇండియా ఏతో పర్యటనలో ఉన్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ జడేజా రంజీ ట్రోపీలో నిలకడగా రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్ ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్ లో 15.30 సగటుతో పది వికెట్లు పడగొట్టాడు. సౌరభ్ చివరిలో బ్యాటింగ్ లోనూ రాణించగలడు. సైనీకి గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లతో బౌలింగ్ విభాగంలో చేరుతాడు.