IPL 2022: ఆర్సీబీకి పెద్ద లోటు అదే – వీరేంద్ర సెహ్వాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో భాగంగా మూడో మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆడనున్నారు. ఆదివారం మార్చి 27న తొలి గేమ్ జరగనున్న క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్..

IPL 2022: ఆర్సీబీకి పెద్ద లోటు అదే – వీరేంద్ర సెహ్వాగ్

Chahal

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో భాగంగా మూడో మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆడనున్నారు. ఆదివారం మార్చి 27న తొలి గేమ్ జరగనున్న క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంపై స్పందించాడు. చాహల్ ను వేలంలో దక్కించుకోకపోవడం ఆ జట్టుకు తీవ్రమైన లోటు అని వెల్లడించాడు.

ఆర్సీబీకి కొత్త కెప్టెన్‌గా డుప్లెసిస్ రిక్రూట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. వేలం సమయానికి కోహ్లీ కెప్టెన్‌గా లేకపోవడం, కొత్త కెప్టెన్ ఎంపిక అవకపోవడంతో ప్లేయర్ల ఎంపికలో చాహల్ ను ఎవరూ తీసుకోలేదు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మొహమ్మద్ సిరాజ్ లను మాత్రమే జట్టు అంటిపెట్టుకుంది.

అయితే హర్షల్ పటేల్ ను వేలంలో మిస్ అవలేదు కానీ, యుజ్వేంద్ర చాహల్ ను సొంతం చేసుకోలేకపోయింది. ఎనిమిదేళ్లుగా ఫ్రాంచైజీతో కలిసి ప్రయాణించిన చాహల్ ను తీసుకోకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అదే ఆర్సీబీ చేసిన పెద్ద పొరబాటు అని వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశారు.

Read Also : ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ.. చెన్నైపై గెలుపు

‘వాళ్ల రిటైన్ పాలసీలో చాహల్ ను అంటిపెట్టుకోలేకపోయారు. దుబాయ్ లో గానీ బెంగళూరులో అయినా చిన్న పిచ్ లపై బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇవ్వగలడు. చాలా వికెట్లు పడగొడతాడు కూడా. నేను ఆర్సీబీలో భాగమై ఉంటే, చాహల్ ను ఏ రేటుకైనా సొంతం చేసుకునే వాడ్ని. రిటెన్షన్ పాలసీ నాకు తెలుసు. కానీ, చాహల్ కీ పర్సన్. సిరాజ్ టీమిండియాలో ప్లేయర్. అతనికి ఈ పర్‌ఫార్మెన్స్ ఎక్స్‌పీరియెన్స్ గా పనికొస్తుందని తెలుసు. కానీ, భారమంతా ఒకరి భుజాలమీదే వేయడం కరెక్ట్ కాదు’ అని సెహ్వాగ్ కామెంట్ చేశారు.