Steve Smith: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో స్టీవ్ స్మిత్ సెంచ‌రీ.. ప‌లు రికార్డులు బ్రేక్‌

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, స్టార్ ఆట‌గాడు స్టీవ్ స్మిత్(Steve Smith) ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(WTC Final 2023) మ్యాచ్‌లో శ‌త‌కంతో చెల‌రేగాడు. మొత్తం 268 బంతుల‌ను ఎదుర్కొని 19 ఫోర్ల‌తో 121 ప‌రుగులు చేశాడు.

Steve Smith: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో స్టీవ్ స్మిత్ సెంచ‌రీ.. ప‌లు రికార్డులు బ్రేక్‌

Steve Smith

Steve Smith century: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, స్టార్ ఆట‌గాడు స్టీవ్ స్మిత్(Steve Smith) ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(WTC Final 2023) మ్యాచ్‌లో శ‌త‌కంతో చెల‌రేగాడు. మొత్తం 268 బంతుల‌ను ఎదుర్కొని 19 ఫోర్ల‌తో 121 ప‌రుగులు చేశాడు. మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 95 ప‌రుగుల‌తో ఉన్న స్మిత్ రోజు రెండు రోజు మొద‌టి ఓవ‌ర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో వ‌రుస‌గా రెండు ఫోర్లు కొట్టి సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఇది టెస్టుల్లో స్మిత్‌కు 31వ శ‌త‌కం కాగా.. ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై ఏడో శ‌త‌కం కావ‌డం విశేషం. ఫైన‌ల్‌లో సెంచ‌రీ చేయ‌డంతో స్మిత్ ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

భార‌త్‌పై అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు

టెస్టుల్లో టీమ్ఇండియాపై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో ఇప్ప‌టి వ‌ర‌కు జోరూట్ (9 శ‌త‌కాలు) అగ్ర‌స్థానంలో ఉండ‌గా.. తాజా సెంచ‌రీతో స్మిత్ కూడా 9 సెంచ‌రీల‌తో సంయుక్తంగా మొద‌టి స్థానాన్ని ఆక్ర‌మించాడు. ఆ త‌రువాత ఎనిమిది సెంచ‌రీల‌తో రికీ పాంటింగ్‌, స‌ర్ వివ్ రిచ‌ర్డ్స్‌, గ్యారీ సోబ‌ర్స్ ఉన్నాడు.

WTC Final 2023: తుది జట్టులోకి అశ్విన్‌ను తీసుకోకపోవటానికి కారణమేంటో తెలుసా? కెప్టెన్ రోహిత్ ఏం చెప్పారంటే..

విరాట్‌, పాంటింగ్ రికార్డు బ్రేక్‌

తాజా సెంచ‌రీతో అత‌డు రికీ పాంటింగ్‌, విరాట్ కోహ్లిల రికార్డును బ్రేక్ చేశాడు. భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆస్ట్రేలియా ఆట‌గాడిగా స్మిత్ నిలిచాడు. తాజాగా మ్యాచ్‌తో క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌పై 19 టెస్టులు ఆడిన స్మిత్ 36 ఇన్నింగ్స్‌ల‌లో 9 శ‌త‌కాలు చేశారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి, రికీ పాంటింగ్‌లు చెరో ఎనిమిది శ‌త‌కాలతో మూడో స్థానంలో నిలిచారు. 11 శ‌త‌కాల‌తో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియా త‌రుపున అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు

ఆస్ట్రేలియా త‌రుపున అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో దిగ్గ‌జ ఆట‌గాడు రికీ పాంటింగ్ 41 శ‌త‌కాల‌తో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత 32 సెంచ‌రీల‌తో స్టీవ్ వా ఉన్నాడు. నిన్న‌టి వ‌ర‌కు మాథ్యూహేడెన్‌(30)తో క‌లిసి మూడో స్థానంలో ఉన్న స్మిత్ ఇప్పుడు హెడెన్‌ను అధిగ‌మించి 31 శ‌త‌కాల‌తో మూడో స్థానంలోనే ఉన్నాడు.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో రోహిత్ శ‌ర్మ‌ ఒక్క బంతిని స‌రిగ్గా క‌నెక్ట్ చేసినా చాలు..