భవిష్యత్ టీమిండియా కోచ్‌గా రిక్కీ పాంటింగ్: గంగూలీ

భవిష్యత్ టీమిండియా కోచ్‌గా రిక్కీ పాంటింగ్: గంగూలీ

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2019వ సీజన్లో వేగంతో దూసుకెళ్తుంది. కోచ్ రిక్కీ పాంటింగ్, ముఖ్య సలహాదారు సౌరవ్ గంగూలీ చొరవతో 2012తర్వాత ప్లే ఆఫ్‌కు చేరుకోవడమే కాకుండా లీగ్ టేబుల్‌లో టాప్‌ స్థానాన్ని దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంతటి వైభవాన్ని తెచ్చిపెట్టినందుకు గంగూలీ, పాంటింగ్‌లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 
Also Read : ఇదేనా గుర్తింపు : స్టేడియం ఎదుట పండ్లు అమ్ముతున్న తైక్వాండో అంతర్జాతీయ క్రీడాకారిణి

ఇదిలా ఉంటే, ఐసీసీ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగుస్తుంది. ఈ క్రమంలో భవిష్యత్ టీమిండియా హెడ్ కోచ్ పదవికి రిక్కీ పాంటింగ్ సరిపోతాడని భావిస్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్. స్వదేశానికి 8 నుంచి 9నెలల పాటు దూరంగా ఉండటానికి పాంటింగ్ సిద్ధంగా ఉంటే కోచ్ పదవికి ఆయన అన్ని విధాల అర్హుడని గంగూలీ తెలిపాడు. 

‘ఓహ్.. మేం గొప్ప స్నేహితులం. ఒకానొక సమయంలో మేం మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్న మాట వాస్తవమే. కొన్నేళ్లుగా మేం మంచి స్నేహితులుగా ఉంటున్నాం. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు బాగా రాణించేలా చేస్తున్నాడు. క్రికెటర్లు ప్రాక్టీసు చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. డైరక్ట్‌గా మ్యాచ్ మూడ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఢిల్లీ బాగా రాణిస్తుంది. శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కగిసో రబాడలు బాగా ఆడుతున్నారు’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. 
Also Read : SBI కొత్త రూల్ : సేవింగ్స్ ఖాతాలో నిల్వలపై వడ్డీ తగ్గింపు