Ricky Ponting: ఆ సమయంలో పంత్‌ కోలుకుంటే నా పక్కనే కూర్చోబెట్టుకుంటా.. రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రిషబ్ పంత్ ఐపీఎల్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రమాదం కారణంగా 2023 ఐపీఎల్ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. ఈ విషయంపై జట్టు ప్రధాన కోచ్ రికీ పాటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ricky Ponting: ఆ సమయంలో పంత్‌ కోలుకుంటే నా పక్కనే కూర్చోబెట్టుకుంటా.. రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ricky Ponting

Ricky Ponting: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. పంత్ తీవ్రంగా గాయపడటంతో మరో ఆరు నెలలుపాటు మైదానంలోకి వచ్చే అవకాశం లేదు. అతని కాలులో మూడు లిగమెంట్లు నలిగిపోయాయి. దీంతో రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ గాయాల నుంచి బయటపడేందుకు మరో ఆరునెలలు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. తాజాగా, పంత్ ఆరోగ్య పరిస్థితిపై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Rishabh Pant: కోలుకుంటున్న రిషబ్ పంత్.. రెండు వారాల్లో డిశ్చార్జయ్యే అవకాశం

పంత్ ఐపీఎల్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రమాదం కారణంగా 2023 ఐపీఎల్ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. ఈ విషయంపై జట్టు ప్రధాన కోచ్ రికీ పాటింగ్ ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. పంత్ మైదానంలోకి రాకపోయినప్పటికీ.. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో కోలుకుంటే తన పక్కనే డగౌట్‌లో కూర్చోబెట్టుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తమ జట్టు ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం మార్చిలో శిక్షణ ప్రారంభిస్తుందని, రిషిబ్ పంత్ ఆ సమయంలో పూర్తి ఫిట్ నెస్‌తో కోలుకుంటాడని నమ్మకం ఉందని పాటింగ్ వ్యాఖ్యానించారు.

Rishabh Pant: ప్రమాదం తర్వాత పంత్ తొలి ట్వీట్.. సర్జరీ గురించి ఏం చెప్పాడంటే

పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే ఐపీఎల్‌లో అతన్ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసిన విషయం విధితమే. అయితే, పంత్ ఐపీఎల్ టోర్నీలోనేకాక ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌లో ఆడే విషయంలోనూ సస్పెన్షన్ కొనసాగుతుంది. అప్పటి వరకు పూర్తిగా కోలుకొని పంత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే మినహా వన్డే ప్రపంచ కప్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయినట్లే.