టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌కు గవాస్కర్, టెండూల్కర్‌ల సంతాపం

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌కు గవాస్కర్, టెండూల్కర్‌ల సంతాపం

క్రికెట్ లెజెండ్స్ సునీల్ గవాస్కర్.. సచిన్ టెండూల్కర్ శుక్రవారం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ మృతికి సంతాపం తెలియజేశారు. బాపూ నడ్కర్ణీ 86ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో మరణించారు. 41టెస్టు మ్యాచ్‌లలో భారత టెస్టుకు ప్రాతినిధ్యం వహించారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్.. ఈయన స్పెషాలిటీ.

టెండూల్కర్ ట్వీట్‌లో.. ‘శ్రీ బాపూ నడ్కర్నీ మరణవార్త చాలా బాధాకరం. టెస్టు ఫార్మాట్లో 21మెయిడెన్ ఓవర్లు వేసిన వ్యక్తిగా ఆయన రికార్డులు వింటూ పెరిగా. ఆయన కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు. 

టెండూల్కర్ కంటే గవాస్కర్ కు ఇది పర్సనల్ లాస్. 1980-81లో ఆస్ట్రేలియాలో భారత పర్యటన కాలంలో నడ్కర్నీ అసిస్టెంట్ మేనేజర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో వీరిద్దరి మద్య సాన్నిహిత్యం ఎక్కువగానే ఉండేదట. ఈ సందర్భంగా గవాస్కర్.. ఇలా పేర్కొన్నాడు. 

‘అతను కొన్ని పర్యటనలకు అసిస్టెంట్ మేనేజర్ గా వచ్చారు. చాలా ఎంకరేజ్ అందించేవారు. అతనెప్పుడూ చోడో మత్.. వదలద్దు అంటుండేవారు. గ్లౌజులు, ప్యాడ్స్ సరిగా లేని కాలంలోనే మంచి క్రికెటర్. అయినప్పటికీ ఆయన పాలసీని మార్చుకోరు. టూర్ లో ఉన్న రోజుల్లో ఆయన స్ట్రాటజీలో చాలా సాయం చేసేవారు’

‘టీమ్ లంచ్ సమయంలో ఫీల్డింగ్ కెప్టెన్ గా ఉంటే ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని అంటుండేవారు. ఓ బౌలర్ తో ఎలాంటి బంతులు వేయించగలమో చెప్పేవారు. ఆయన ఫెంటాస్టిక్. ఇండియన్ క్రికెట్ ఓ రియల్ ఛాంపియన్‌ను మిస్సయ్యింది’ అని గవాస్కర్ వెల్లడించాడు.