Rishabh Pant: కోలుకుంటున్న రిషబ్ పంత్.. రెండు వారాల్లో డిశ్చార్జయ్యే అవకాశం

అతడి లిగ్మెంట్ గాయాలకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స, గాయాల నుంచి పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ దశలో ఇంకా అతడికి చికిత్స అందించాల్సి ఉంది. ఈ శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోవాలంటే కనీసం ఆరు వారాలు పడుతుంది.

Rishabh Pant: కోలుకుంటున్న రిషబ్ పంత్.. రెండు వారాల్లో డిశ్చార్జయ్యే అవకాశం

Rishabh Pant: గత నెల 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఇటీవలే అతడికి శస్త్ర చికిత్స పూర్తైంది. ఈ విషయాన్ని పంత్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

అతడి లిగ్మెంట్ గాయాలకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స, గాయాల నుంచి పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ దశలో ఇంకా అతడికి చికిత్స అందించాల్సి ఉంది. ఈ శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకోవాలంటే కనీసం ఆరు వారాలు పడుతుంది. ఆ తర్వాతే అతడి రిహాబిలిటేషన్ మొదలవుతుందని వైద్యులు అంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం మరో రెండు వారాల్లో పంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి. పంత్ కోలుకుంటున్నందున రెండు వారాల్లో డిశ్చార్జ్ అవ్వొచ్చు. ఆ తర్వాత కూడా అతడు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. కొంతకాలంపాటు రిహాబిలిటేషన్ ట్రీట్‌మెంట్ అవసరం పడుతుంది.

Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోరు

అలాగే ఇంకా అతడికి ఎలాంటి శస్త్రచికిత్సలు అవసరం ఉండకపోవచ్చని తెలుస్తోంది. మునుపటిలాగా రిషబ్ పంత్ పూర్తి ఆరోగ్యంగా ఉంటూ మైదానంలో అడుగుపెట్టాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరో రెండు నెలల తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పూర్తిగా పరిశీలిస్తారు. ఆ తర్వాతే అతడు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే అంశంపై క్లారిటీ రావొచ్చు. ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం.. పంత్ తిరిగి క్రికెట్ ఆడాలంటే కనీసం 4-6 నెలల సమయం పట్టొచ్చు.