Ravichandran Ashwin: నిజానికి రిషబ్ పంతే నన్ను తక్కువ చేస్తున్నాడు

టీమిండియా టెస్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంత గడ్డపై సీజన్ ను మొదలుపెట్టి 32వికెట్లు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో బ్యాట్ తోనూ అదరగొట్టాడు. కాకపోతే డీఆర్ఎస్ లో మాత్రం..

Ravichandran Ashwin: నిజానికి రిషబ్ పంతే నన్ను తక్కువ చేస్తున్నాడు

RISHAB PANT ASHWIN

Ravichandran Ashwin: టీమిండియా టెస్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంత గడ్డపై సీజన్ ను మొదలుపెట్టి 32వికెట్లు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో బ్యాట్ తోనూ అదరగొట్టాడు. కాకపోతే డీఆర్ఎస్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. దీనిపై స్పందించిన అశ్విన్ తను పంత్ కారణంగానే తక్కువ అయిపోతున్నానని అంటున్నాడు.

డీఆర్ఎస్ కాల్స్ ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదని.. ప్రత్యేకించి ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన మ్యాచ్ లలో అలా జరిగిందని వెల్లడించాడు.

డీఆర్ఎస్ రివ్యూ అడిగేటప్పుడు కాస్త చూసే కోణం మార్చుకుని చూడాలి. ఇంగ్లాండ్ తో సిరీస్ జరగడానికి ముందు నా డీఆర్ఎస్ పద్ధతి చాలా బాగుండేది. ఎందుకంటే అలా రివ్యూ అడిగే ముందు కీపర్ నుంచి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. వాల్యూబుల్ ప్రశ్నలే అడిగి రివ్యూ గురించి సంప్రదిస్తాను.

రిషబ్ పంత్ బ్యాటింగ్ లో ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా ఆడుతున్నా.. వికెట్ కీపింగ్ క్వాలిటీ మాత్రం చాలా డల్ గా ఉంది. నేను బౌలింగ్ చేస్తున్న బౌన్స్ యాంగిల్ తో పాటు కీపర్ కూడా కచ్చితంగా సాయం చేయాలి. నిజానికి రిషబ్ పంత్ ఆ విషయంలో చాలా సందర్భాల్లో నన్ను తక్కువ చేస్తున్నాడు. ఒకసారి కూర్చొని దీని గురించి మాట్లాడుకోవాలి.

నిజాయతీగా చెప్పాలంటే నేను ఒక విషయంలో ఇంప్రూవ్ చేసుకోవాలి. భవిష్యత్ లో బెటర్ డీఆర్ఎస్ కోసం పనిచేస్తాం. చాలా రోజుల తర్వాత ఇలాంటి మైదానాలపై ఆడుతున్నాం. ఇది చాలా పెద్ద రోల్. అని అశ్విన్ చెప్పాడు.