IPL 2023: “ఆడడానికి నేనూ వస్తున్నాను” అంటున్న రిషభ్ పంత్.. అక్కడే ఓ ట్విస్ట్.. వీడియో
"ఆహారం, క్రికెట్.. ఈ రెండు లేకుండా నేను ఉండలేను. కొన్ని నెలలుగా క్రికెట్ ఆడలేకపోతున్నాను. ప్రతి ఒక్కరూ ఆడుతున్నప్పుడు నేనెందుకు ఆడలేనని అనుకుంటున్నాను. ఆడడానికి వస్తున్నాను" అని రిషభ్ చెప్పాడు. అనంతరం ZPL 2023 అని యాడ్ పడుతుంది.

IPL 2023
IPL 2023: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ ఐపీఎల్-2023 సీజన్ వేళ తానూ ఆడడానికి వస్తున్నానని అంటున్నాడు. అయితే, అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అతడు ఆడతానంటోంది ఐపీఎల్-2023లో కాదు.. జెడ్పీఎల్-2023లో. ఇదెక్కడి టోర్నమెంట్ అనుకుంటున్నారా? తాజాగా, రిషభ్ పంత్ పోస్ట్ చేసిన వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
జోమాటో ఫుడ్ డెలివరీ యాప్ కు రిషభ్ పంత్ యాడ్ ఇచ్చాడు. అందులోని అతడు చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొన్ని వారాల క్రితం రిషభ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురి కావడంతో ఐపీఎల్-2023లో ఆడడం లేదు. అతడి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కి డేవిడ్ వార్నర్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు.
వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ వ్యవహరిస్తాడు. 2022 సీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషభ్ పంత్ సారథ్యం వహించాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023కి రిషభ్ పంత్ దూరం కావడంతో అతడు వీల్ చైర్ పైనే ఉంటూ తాజాగా జొమాటోకు యాడ్ ఇచ్చాడు.
“ఆహారం, క్రికెట్.. ఈ రెండు లేకుండా నేను ఉండలేను. కొన్ని నెలలుగా క్రికెట్ ఆడలేకపోతున్నాను. మంచి ఆహారం తినాలని వైద్యులు చెప్పారు. ఇంట్లో మంచి ఆహారం తీసుకుంటున్నాను. క్రికెట్ సీజన్ మొదలవుతోంది. ప్రతి ఒక్కరూ ఆడుతున్నప్పుడు నేనెందుకు ఆడలేనని అనుకుంటున్నాను. నేను ఇప్పటికీ ఆటలోనే ఉన్నాను. ఆడడానికి వస్తున్నాను” అని రిషభ్ చెప్పాడు. అనంతరం ZPL 2023 అని పడుతుంది.
It’s time for a comeback 💪 #RishabhIsBack @zomato
…#Ad #PaidPartnership pic.twitter.com/N2whFvsNdw
— Rishabh Pant (@RishabhPant17) March 29, 2023