Rishabh Pant Health: మెరుగైన చికిత్సకోసం.. ముంబైకి రిషబ్ పంత్‌

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పంత్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబైకి తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై డీడీసీఏ అధ్యక్షుడు శ్యామ్ శర్మ మాట్లాడుతూ..

Rishabh Pant Health: మెరుగైన చికిత్సకోసం.. ముంబైకి రిషబ్ పంత్‌

Rishabh Pant

Rishabh Pant Health Update: టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. ప్రస్తుతం అతను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పంత్ నుదిటిపై తీవ్రగాయమైంది. కుడికాలు లిగమెంట్ నలిగిపోయింది. దీంతో లిగమెంట్ చికిత్సకోసం పంత్‌ని ముంబైకి తరలించనున్నట్లు తెలుస్తుంది.

Rishabh Pant: తన ప్రాణాలు కాపాడిన ఇద్దరు యువకులతో ఆసుపత్రిలో మాట్లాడిన రిషబ్ పంత్

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పంత్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబైకి తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై డీడీసీఏ అధ్యక్షుడు శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. పంత్ ను తదుపరి చికిత్స కోసం ముంబైకి తరలించనున్నామని తెలిపారు. ఇదిలాఉంటే పంత్ ఆరోగ్య విషయాలపై డీడీసీఏ, బీసీసీఐ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది.

Rishabh Pant: “ఫైటర్” రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలి.. బీసీసీఐ వీడియో.. ద్రవిడ్ ఏమన్నారంటే?

క్రిస్మస్ వేడుకలు జరుపుకొని భారత్‌కు చేరుకున్న పంత్.. గతనెల 30న ఒక్క‌రే కారును డ్రైవ్ చేసుకుంటూ త‌న నివాసానికి వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో మహ్మద్‌పూర్ జాట్ సమీపంలో కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. గాయపడ్డ పంత్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం డెహ్రా డూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లిగమెంట్ చికిత్స కోసం ముంబై ఆస్పత్రికి తరలించనున్నారు.