MS Dhoni: రచ్చ మొదలు..రోహిత్, ధోనిల ఫ్యాన్ వార్.. ‘మా వాడు గొప్పంటే.. కాదు మావాడు అంటూ’
నెలన్నర రోజులకు పైగా అలరించిన ఐపీఎల్-16 సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మల అభిమానుల మధ్య వార్ నడుస్తోంది.

MS Dhoni-Rohit sharma
MS Dhoni-Rohit sharma: నెలన్నర రోజులకు పైగా అలరించిన ఐపీఎల్-16 సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans))ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఐదో టైటిల్‌ను ధోని సేన ముద్దాడింది. ఇదే సమయంలో అత్యధిక టైటిళ్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) రికార్డును సమం చేసింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni), రోహిత్ శర్మ(Rohit sharma) ల అభిమానుల మధ్య వార్ నడుస్తోంది.
నిన్నటి వరకు ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరు అంటే టైటిళ్ల పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ పేరు వినిపించేంది. అయితే.. తాజాగా కెప్టెన్ కూల్ కూడా ట్రోఫీల పరంగా అన్నే గెలుచుకోవడంతో ఇప్పుడు ఎవరు గొప్ప కెప్టెన్ అన్నదానిపై అటు రోహిత్, ఇటు ధోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొట్లాడుకుంటున్నారు. ‘మా వాడే గొప్ప కెప్టెన్ అంటే కాదు మా వాడే గొప్పొడు’ అంటూ ఒకరికి పోటీగా మరొకరు పోస్టులు పెడుతున్నారు.
‘2007లో టీ20 ప్రపంచకప్, సీఎల్‌టీ20 ట్రోఫీ(2010,2014), ఆసియా కప్(2010, 2016), 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ టైటిళ్లు(2010, 2011, 2018,2021,2023) లు’ ధోని అత్యుత్తమ కెప్టెన్ అని చెప్పడానికి నిదర్శనం అంటూ ఓ నెటీజన్ ట్వీట్ చేశాడు. ధోని హయాంలో రెండు సార్లు టీమ్ఇండియా ప్రపంచకప్‌లు గెలుచుకుందని అందుకని ధోనినే గొప్పనాయకుడు అని ధోని అభిమానులు కామెంట్ చేశారు.
Baat khatam 🙌🙏 pic.twitter.com/Y7b7TLZ2Sw
— Ash (@aashish27721337) May 29, 2023
Rohit Sharma: మా కొంపముంచింది అతడే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ ఇలాగే ఆడాలి
‘రోహిత్ శర్మ 10 సంవత్సరాల కెప్టెన్సీలో 5 ట్రోఫీలు అందుకున్నాడు. అదే ఎంఎస్ ధోని 5 ట్రోఫీలను సాధించడానికి 15 సంవత్సరాలు పట్టింది. రోహిత్ ఒక్కసారి కూడా ఐపీఎల్ ఫైనల్ ఓడిపోలేదు. ధోని మాత్రం నాలుగు సార్లు ఫైనల్స్ ఓడిపోయాడు. హిట్‌మ్యాన్ మూడు సార్లు ఫైనల్స్‌లో మహిని ఓడించాడు. అదే ధోని ఒక్కసారి కూడా హిట్‌మ్యాన్‌ను ఓడించలేదు. ఈ విషయాలు అన్ని బట్టి చూస్తే ఐపీఎల్‌లో రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అంటూ రోహిత్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
ఇలా రోహిత్, ధోని అభిమానులు ఎవరికి వాళ్లు తమ అభిమాన ఆటగాడే గొప్పవాడు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీన్ని చూసిన మరికొందరు నెటీజన్లు అసలు ధోని, రోహిత్ శర్మలు ఇద్దరి మధ్య ఎలాంటి ఇగోలు లేవని, వాళ్ల మధ్య ఇలాంటి విషయం కనీసం ప్రస్తావనకు కూడా రాదని, మధ్యలో మీరేందుకు కొట్టుకుచస్తున్నారంటూ మండిపడుతున్నారు.