Team India New Test Jersey: కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమ్ఇండియా ఆటగాళ్లు.. రోహిత్, కోహ్లి, జడేజాలను చూశారా..?
లండన్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించిన ఫోటోలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) అభిమానులతో పంచుకుంది.

Team India New Test Jersey
Team India: లండన్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు లండన్‌కు చేరుకుని తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. కొత్త జెర్సీ లుక్‌కు సంబంధించిన ఫోటోలను ఇటీవల విడుదల చేశారు. కాగా.. నేడు(సోమవారం) భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించిన ఫోటోలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) అభిమానులతో పంచుకుంది.
కాగా.. ఇటీవల టీమ్ఇండియా కిట్ స్పాన్సర్ మారింది. అడిడాస్ కొత్త స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో అడిడాస్ కంపెనీతో భాగస్వామ్యంలో ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం ప్రత్యేక జెర్సీలను డిజైన్ చేశారు. ఈ జెర్సీని ధరించిన ఆటగాళ్లతో ఫోటో షూట్ చేశారు. రోహిత్ శర్మ. విరాట్ కోహ్లి, శుభ్ మన్ గిల్, రవీంద్ర జడేజా లో పాటు మిగిలిన ఆటగాళ్లు కొత్త జెర్సీలో మెరిసిపోతున్నారు. 2028 వరకు బీసీసీఐ అడిడాస్‌తో ఒప్పందం చేసుకుంది.
Yash Dayal: సోషల్ మీడియాలో యశ్ దయాల్ వివాదాస్పద పోస్ట్.. ఆ వెంటనే డిలీట్.. సారీ చెప్పినా..
Lights 💡
Camera 📸
Headshots ✅#TeamIndia | #WTC23 pic.twitter.com/9G34bFfg78
— BCCI (@BCCI) June 5, 2023
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంది. తొలి ఎడిషన్(2019-21)లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, భారత్ లు తలపడ్డాయి. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక 2013 నుంచి టీమ్ఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేదు. దీంతో రోహిత్ సేన ఆస్ట్రేలియాపై విజయం సాధించి దాదాపు 10 ఏళ్ల నిరీక్షణ తెరదించాలని చూస్తోంది.
WTC Final : టెస్ట్ ఛాంపియన్ ఎవరు ?
— BCCI (@BCCI) June 5, 2023