Rohit Sharma : టీ20 క్రికెట్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ రికార్డ్

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో మూడు వేల పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన 3వ ప్లేయర్ గా నిలిచాడు. 108 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్..

Rohit Sharma : టీ20 క్రికెట్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ రికార్డ్

Rohit Sharma

Rohit Sharma : టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో మూడు వేల పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన 3వ ప్లేయర్ గా నిలిచాడు. 108 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ అందుకున్నాడు.

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా న‌మీబియాతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్ లో ఎక్కువ ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ల‌ లిస్టులో రోహిత్ శ‌ర్మ కూడా చేరాడు. టీ20 క్రికెట్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ ప‌రుగులు చేసి నెంబ‌ర్ వ‌న్ స్థానంలో విరాట్ కోహ్లీ (3227) ఉండ‌గా.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్(3115) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానానికి రోహిత్ శ‌ర్మ చేరుకున్నాడు. కాగా, టీ20లలో 4 సెంచరీలు చేసింది రోహిత్ మాత్రమే. ఇక 23 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.